We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
TGSPDCL Chairman Jitesh V Patil advised farmers in the Bibinagar mandal to cultivate alternative, low-water crops like vegetables and moringa to conserve groundwater and increase income, and ordered officials to improve agricultural power supply quality.
– టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వి.పాటిల్ – నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపునకు ఆరుతడి పంటల సాగు కీలకం
బీబీనగర్, అక్టోబర్ 21 : రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేశ్ వి.పాటిల్ రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలను సంరక్షించేందుకు తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా బుధవారం బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, చినరావులపల్లి, బట్టుగూడెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వ్యవసాయ సమస్యలు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.…
Minister Ponnam Prabhakar announced that the government has granted administrative approvals for irrigation projects in the Husnabad constituency, including the Indiramma flood canal and the Sriram Sagar Project, as a Dussehra gift to farmers.
శంకరపట్నం/జైనథ్, అక్టోబర్ 19 : సాగునీరందించడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం.. అన్నదాతలకు శాపంలా మారుతున్నది. సరైన వర్షాలు లేక ఓవైపు.. కరెంట్ కోతలతో నీళ్లందక మరోవైపు పంటలు ఎండుముఖం పట్టాయి. కండ్ల ముందే పంటలు దెబ్బతింటుండటంతో చూసి తట్టుకోలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం చోటుచేసుకున్నాయి. బాధిత రైతుల కుటుంబాల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటలో చెందిన నాంపెల్లి సాంబయ్య (55) తనకున్న రెండున్నర ఎకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని, వరి సాగు చేశాడు. రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఈ సారి కాకతీయ…
ఆదివారం బతుకమ్మ పండుగ కావడంతో ఇంట్లో బతుకమ్మ పేర్చి బయటకు వెళ్లాడు. సాయంత్రం భార్య శోభ, కొడుకులు అజయ్, శ్రావణ్ గ్రామంలోని బతుకమ్మ వేడుకలకు వెళ్లి, రాత్రి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10.35 గంటల ప్రాంతంలో సాంబయ్య మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఎందుకు తాగావని అడిగితే.. పొలానికి నీళ్లు పారడం లేదని, ఆ బాధతోనే తాగానని చెప్పాడు. ఈ క్రమంలో భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుమారుడు అజయ్ పరిసరాల్లో వెతికాడు. రాత్రి 11:45 గంటల సమయంలో తన వ్యవసాయ పొలానికి సమీపంలో ఉన్న వాగు వద్ద చెట్టుకు లుంగీతో ఉరివేసుకొని విగత జీవిగా కన్పించాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు…
హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) పరిధిలోని ఇందిరమ్మ వరద కాలువ ప్యాకేజీ-3 పనులకు సంబంధించి ప్రభుత్వం జీవో నెం.518 (G.O.Rt.No.518, తేదీ: 19.10.2026) ద్వారా కీలక పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు.
రైతులకు సాగునీరు అందించడంతో పాటు నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.211.172 కోట్లతో వేరియేషన్ ఎస్టిమేట్-IIకు పరిపాలనా ఆమోదం లభించగా, మరోవైపు ఎడమ, కుడి ప్రధాన కాలువల్లో సీసీ లైనింగ్, అదనపు నిర్మాణాల కోసం రూ.40.779 కోట్లతో కొత్త టెండర్లు పిలిచేందుకు ప్రత్యేకంగా అనుమతి మంజూరైందని తెలిపారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.