We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
హైదరాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ రైతులకు ధరల ఫికర్ పట్టుకున్నది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ఆయిల్‌పామ్ గెలల ధర భారీగా తగ్గుతున్నది. గెల ధర టన్నుకు రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు తగ్గే అవకాశం కనిపిస్తున్నది. క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకం 44%గా ఉండేది. కేంద్రం ఈ ఏడాది తొలినాళ్లలో 27.5 శాతానికి, జూన్‌లో 16.5 శాతానికి, తాజాగా 11 శాతానికి తగ్గించింది. ఇలా ఒక్క ఏడాదిలోనే క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44% నుంచి 11 శాతానికి అంటే 33% మేర తగ్గించింది. పామాయిల్ రైతులకు ఇదే శాపంగా మారింది.…
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని ప్రజావాణి విభాగానికి వచ్చిన ఓ రైతు తన ఐదెకరాల భూమిని వేరొకరు కబ్జా చేశారని ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్నవారు వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌పామ్ రైతులకు విద్యుత్ లైన్ల సమస్యకు పరిష్కారంగా ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల దృష్టికి తీసుకువచ్చారు.
ఆదిలాబాద్ : వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్రంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనిపించిన ప్రతీ అధికారికి తమ గోడును వెల్లబు చ్చుకుంటున్నారు. కరెంట్ సక్రమంగా ఇవ్వాలని,ఎండిన పంటలకు పరిహారం అందించాలని పదేపదే వేడుకుంటున్నారు. కరువు మండలంగా ప్రకటిస్తే కొంతలో కొంత ఆర్థిక వెసులుబాటు దొరుకుతుందన్న ఆశతో రైతులు అధికారులకు కాళ్ల, వేళ్ల బ్రతిమిలాడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు( Talamadugu ) మండలాన్ని కరువు మండలం ( Drought ) గా ప్రకటించాలని మండల రైతులు సోమవారం జాతీయ రహదారిపై నాలుగు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్డీవో, పోలీసులు రైతులకు నచ్చేజేపేందుకు వచ్చారు. ఇంతల్లో లస్మన్న అనే రైతు ఆర్డీవో జగదీశ్వర్ రావు కాళ్లు ( RDOs feet ) పట్టుకొని కరువు మండలంగా ప్రకటించాలని వేడుకోవడం అందరిని కలిచివేసింది. రైతుల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించుకున్నారు.
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలోపెట్టుకొని చెక్‌డ్యామ్‌లు నిర్మించి రైతులను ఆదుకోవడంతో ఖరీఫ్‌లో మంచి దిగుబడి వచ్చిందన్నారు. వరి ఎండిపోయిందని సోషల్ మీడియాలో కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Farmer | ఎల్‌నినో ప్రభావం, కరెంట్ కోతలు, సాగు నీరందక రాష్ట్రంలో రైతన్న పరిస్థితి ఎలా ఉందో కండ్లకు కట్టినట్టు చూపించే చాలా దృశ్యాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొనుగోలు కేంద్రాలు, రోడ్డెక్కి ధర్నా చేస్తున్న సందర్భంగా పలువురు రైతన్నలు అధికారులు, పోలీసుల కాళ్లపై వేడుకున్న ఘటనలు మీడియాలో కనిపించాయని తెలిసిందే.
తాజాగా రైతన్నల పరిస్థితిని అద్దం పట్టే ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల రైతులు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ జీవన్ రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్ వారి వద్దకు వచ్చారు.
ఆదిలాబాద్ : తెలంగాణలో ఒక పక్క కరువు, మరో వైపు అధికారుల నిర్లక్ష్యంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నారు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేంతవరకు, విక్రయా నికి మార్కెట్‌కు తరలించినప్పటి నుంచి డబ్బులు చేతికి అందేవరకు అనేక కష్ట నష్టాలే.
ఇంకోవైపు భూమి సమస్యలతో సంవత్సరాల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోక రైతులు ఆత్మహత్యాయత్నాల ( Suicide Attempt) వైపు దృష్టిని సారిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోరోజు మండలం మాండగడ గ్రామానికి చెందిన దేవన్న ( Devanna) అనే రైతు ప్రజావాణిలో భూ సమస్య బాధను చెప్పుకునేందు కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాని కి ( Suicide Attempt ) పాల్పడ్డాడు.
నర్సంపేట గ్రామీణం: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జాతీయ రహదారిపై ఆ గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నల్లబెల్లి మండలంలోని గొల్లపల్లి నుంచి రాజుపేట వరకు కెనాల్ కాల్వ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్న కెనాల్ పనులు చేపట్టడం లేదని, వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని, సంబధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Pegadapally | పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడి ఉత్తం పెద్దలు (52 )అనే రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలంలో రైతు పెద్దలు పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బురదలో దిగబడింది. దిగబడ్డ ట్రాక్టర్ ను తీసేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా ట్రాక్టర్ పూర్తిగా తిరగబడి టైర్లు మీదకి ఇంజన్ కిందికి పడిపోయింది. దీంతో రైతు పెద్దలు అందులో చిక్కుకొని మృతి చెందాడు. పక్కనే ఉన్న భార్య కనకవ్వకు కూడా ట్రాక్టర్ తగిలి కాలు విరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పెగడపల్లి ఎస్సై కుమారస్వామి కేసు నమోదు చేసుకుని…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.