We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూతురి వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించడంపై రాజకీయ చర్చ మొదలైంది. సాక్షి పత్రికలో వచ్చిన కథనాన్ని తప్పుబడుతూ షర్మిల మరియు మంత్రి లోకేష్ ట్వీట్లు చేశారు. పెద్దలను గౌరవించడం మన సంస్కృతి అని లోకేష్ పేర్కొన్నారు.
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూతురి వివాహం పొలిటికల్ డ్రామాకు తెర లేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని యలహంక భవనంలో పెళ్లికి జగన్ అభ్యంతరం చెప్పడం హాట్ చర్చనీయాంశం అవ్వగా.. ఇప్పుడు సీఎం చంద్రబాబును పెళ్ళికి ఆహ్వానించడంపై దుమారం రేగుతోంది.
షర్మిల కూతురి పెళ్ళికి చంద్రబాబును ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ సాక్షి పత్రికలో కథనం వచ్చింది. ఈ కథనాన్ని తప్పు పడుతూ షర్మిల ట్వీట్ చేశారు. మంత్రి లోకేష్ కూడా సాక్షి కథనాన్ని ఖండిస్తూ ట్వీటీ చేశారు. పెద్దలను పెళ్ళికి పిలిస్తే కించపరిచేలా కథనం రాయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు లోకేష్.
ఒక తండ్రి తన కొడుకుకు గౌరవం గురించి ఒక గుణపాఠం చెప్పడానికి అతన్ని జనరల్ బోగీలో తీసుకెళ్లినట్లు వివరించారు. తాను 3 టైర్ ఏసీ బోగీలో ప్రయాణించడం అలవాటని, కానీ దీపావళి హడావుడి కారణంగా అలా చేయాల్సి వచ్చిందని ఆ తండ్రి చెప్పారు.
న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ గ్రూపులో ఆస్తుల పంపకం రచ్చకెక్కింది. టీవీఎస్ గ్రూపులో తన వాటా కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ ఎమెరిటస్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీ వేణు న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు ఉమ్మడి కుటుంబ ఆస్తులను చట్టబద్ధంగా విభజించి, తనకు రావాల్సిన సమాన వాటాను ఇవ్వాలని కోరుతూ లక్ష్మీ తన తండ్రి వేణు శ్రీనివాసన్‌కు లీగల్ నోటీసు పంపారు. కుటుంబపెద్దగా తండ్రి వేణు శ్రీనివాసన్ తన బాధ్యతలను నెరవేర్చి ఆస్తులను న్యాయబద్ధంగా చట్టప్రకారం విభజించేలా చూడాలని నోటీసులో లక్ష్మీ కోరారు.
వీఎస్ ట్రస్ట్ ద్వారా ఉన్న కుటుంబ ఆస్తులతో పాటు 2020 నాటి టీవీఎస్ కుటుంబ ఒప్పందం ప్రకారం వేణు శ్రీనివాసన్ కుటుంబానికి కేటాయించబడిన వ్యాపార వాటాలలో విభజన చేయాలని ఆమె నోటీసులో డిమాండ్ చేశారు. ఇందులో ప్రధానంగా టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ సంస్థల వాటాలు ఉన్నాయి
బెంగళూరు: తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు కుమారుడు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని గదిలో బంధించి, ఇనుప వస్తువుతో కొట్టి తండ్రి హత్య చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు అతడిపై దాడి చేశారు. (Father Kills Son) కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌడనాయకనపాళ్య గ్రామంలో నివసించే నంజే గౌడకు మద్యం సేవించే అలవాటు ఉన్నది. తాగి ఇంటికి వచ్చిన తర్వాత అతడు తరచుగా భార్యతో గొడవ పడేవాడు.
కాగా, ఆదివారం కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నంజే గౌడ తన భర్యతో గొడవపడ్డాడు. అయితే తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు వారి కుమారుడైన 16 ఏళ్ల సునీల్ జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన నంజే గౌడ, తన భార్యను ఇంటి బయటకు పంపాడు. కుమారుడిని లోపల ఉంచి తలుపులు మూశాడు. ఇనుప పరికరంతో అతడ్ని కొట్టి చంపాడు.
Dulquer Vs Mammootty: ఒకేరోజు తండ్రి కొడుకుల బాక్సాఫీస్ వార్
Entertainment — not analysed for political framing
Dulquer Salmaan Vs Mammootty: సినీ ప్రపంచంలో తండ్రీకొడుకులు ఒకే రంగంలో రాణించడం అరుదేమీ కాదు. కానీ ఇద్దరూ నటించిన సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఆసక్తిని రేకెత్తించడం మాత్రం ప్రత్యేకమే. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అలాంటి ఆసక్తికరమైన సందర్భం రాబోతోంది. మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘ఓం’ (O.M – Operation Mole), ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ (AOT) నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో తెలుగు, తమిళ, మలయాళ సినీ వర్గాల్లో ఈ తండ్రీకొడుకుల సినిమాల పోటీపై ఆసక్తి నెలకొంది. మరి తండ్రి అనుభవం పైచేయి…
నవంబర్ 20న విడుదలకు సిద్ధమవుతున్న ఈ రెండు చిత్రాలు కథ, నేపథ్యం, జానర్ పరంగా పూర్తిగా భిన్నమైనవి. ఒకవైపు ప్రేక్షకుల హృదయాలను తాకే భావోద్వేగాలతో కూడిన ఇన్స్పిరేషనల్ డ్రామాగా ‘ఆకాశంలో ఒక తార’వస్తుంటే.. మరోవైపు యాక్షన్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన కథగా ‘ఓం’ సిద్ధమవుతోంది. రెండు సినిమాల టీజర్లు, పాటలు, ట్రైలర్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.