We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
The Chief Secretary of Telangana directed officials to organize cultural performances, celebrity short films, and extensive advertising for the upcoming Invest Telangana Global Summit.
హైదరాబాద్: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్‌పై విస్తృత ప్రచారం చేయాలని, సమ్మిట్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
‘‘రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. అతిథులకు కళారూపాలతో ఘన స్వాగతం పలకాలి. ముగింపు వేడుకల్లో ప్రత్యేక కల్చరల్ కార్నివాల్ నిర్వహించాలి. సమ్మిట్‌పై ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలు, హోటళ్ల వద్ద హోర్డింగులు పెట్టాలి. సమ్మిట్ ప్రాధాన్యతపై సెలబ్రిటీలతో షార్ట్‌ఫిల్మ్‌లు తయారు చేయాలి’’అని సీఎస్ దిశానిర్దేశం చేశారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ థీమ్‌తో ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ 2.0ని నిర్వహించనున్న విషయం తెలిసిందే.
The Employees Union (EU) won the Telangana RTC recognition union elections with 18,276 out of 34,421 votes, defeating the Congress-affiliated TWU. The victory was celebrated by union leaders who distributed sweets to RTC workers.
Telangana Chief Minister Revanth Reddy announced the filling of 16,000 police vacancies by October 2025 and the sanctioning of 7,437 additional posts in 2026.
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : సమాజ భద్రత, రక్షణల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని అనంతపురం రేంజ్ ఐజిపి డాక్టర్ షెముషి, జిల్లా ఎస్పీ పి.జగదీష్ సంయుక్తంగా పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా సాయుధ బలగాల నుండీ ఐజిపి, ఎస్పీలు గౌరవ వందనం స్వీకరించి అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. అనంతపురం రేంజ్ ఐజిపి డాక్టర్ షెముషి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో…
Telangana RTC Union Elections | తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ)ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ప్రభుత్వ అనుబంధ సంఘం టీడబ్ల్యూయూ గెలుపు కోసం చేసిన కుట్రలను తిప్పికొట్టిన ఆర్టీసీ కార్మికులు ఎంప్లాయిస్ యూనియన్‌కు భారీ విజయాన్ని అందించారు.
ఈ నెల 9న జరిగిన తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 34,421 ఓట్లు పోల్ అవ్వగా.. 18,276 ఓట్లు ఎంప్లాయీస్ యూనియన్ సాధించింది.ఎంప్లాయీస్ యూనియన్‌కు ఆర్టీసీ కార్మికులు భారీ మెజారిటీ కట్టబెట్టడంతో యూనియన్ నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు.
ఖమ్మం నేరవిభాగం : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్మృతి పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లోని పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద కలెక్టర్, పోలీస్ కమిషనర్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరులను స్మరించుకుని రెండు…
జిల్లాకలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ... దేశ రక్షణ కోసం లడక్ సరిహద్దు ప్రాంతంలో ప్రాణ త్యాగం చేసిన వీరుల స్ఫూర్తిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ జెండా కేవలం ఒక వస్త్రం కాదని, అది పోలీస్ శాఖ నిత్యం ప్రదర్శించే నిబద్ధత, త్యాగం, గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ప్రగతికి తోడుగా ప్రజలకు భరోసా, రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో కొత్త పోలీసు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2025 అక్టోబర్ నాటికే 16 వేల పోలీస్ ఉద్యోగాలు నియమించడం జరిగిందని, 2026లో మరో 7 వేల 437 పోస్టులు అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. 2028 నాటికి పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. మన కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని మనందరం స్మరించుకుందామని సీఎం పిలుపునిచ్చారు.
అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా పోలీసు అమరుల దినం జరుపుకుంటున్నామని.. 2026లో దేశ వ్యాప్తంగా 154 మంది విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రజల రక్షణ కోసం వారు చేసిన త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేమని, అమరవీరులకు హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నానని సీఎం చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణలో ఇవాళ (అక్టోబర్ 21), రేపు (అక్టోబర్ 22) వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక.. దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
చెన్నైలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై సిటీలో నీటమునిగిన సాలిగ్రామం, టినగర్, వలసరవాకం, గిండి ప్రాంతాలు నీటమునిగిన పరిస్థితులున్నాయి.
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Analysis pending
KTR | తెలంగాణ ప్రజల అతిపెద్ద సాంస్కృతిక పండుగ అయిన దసరాను రాష్ట్ర ప్రజలందరూ అత్యంత ఘనంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను గుర్తుచేశారు.
తెలంగాణ జీవన విధానంలో దసరా పండుగకు అత్యంత విశిష్టమైన స్థానం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో తీరిక లేకుండా ఉండే సొంతూళ్లకు వెళ్లి, చుట్టాలను, శ్రేయోభిలాషులను కలుసుకోవడం, బంధుమిత్రులందరూ ఒకచోట చేరి ఆప్యాయంగా ‘అలాయి-బలాయి’ చేసుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. ఇక దసరా రోజున ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జమ్మి చెట్టుకు పూజలు చేయడం, తెలుగు సంప్రదాయంలో అత్యంత శుభప్రదంగా భావించే ‘పాలపిట్ట’ను దర్శించుకోవడానికి కుటుంబసమేతంగా వెళ్లడం మన ఆచారమని గుర్తుచేశారు.
Palapitta | ఒకప్పుడు పల్లెల్లో, పొలాల గట్లపై, చెట్ల కొమ్మల్లో, విద్యుత్తు తీగలపై విరివిగా కని పించే పాలపిట్ట సంతతి మారుతున్న పర్యావరణ పరిస్థితులతో క్రమంగా కనుమరుగవుతున్నది. దసరా పండుగ సమయంలో పాలపిట్టను చూడటం శుభప్రదమనే నమ్మకం ఉండటంతో ఈ పక్షికి తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నది. అందుకే బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు దీనిని తెలంగాణ రాష్ట్ర పక్షిగా అధికారికంగా గుర్తించారు. అయితే గత దశాబ్దకాలంలో వీటిసంఖ్య గణ నీయంగా తగ్గినట్టు పక్షుల సర్వేలు వెల్లడిస్తున్నాయి.
పట్టణీకరణ, చెట్ల నరికివేత, వ్యవసాయంలో పురుగుమందుల అధిక వినియోగం, ఆవాసాల కొరత, అక్రమంగా పట్టుకోవడం, చైనా మాంజా వంటి అనేక ముప్పులు పాలపిట్టల మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. పాలపిట్టలు సాధారణంగా పాత చెట్ల తొర్రలు,చెట్లలోని ఖాళీ ప్రదేశాల్లో గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి చెట్లు తగ్గిపోవ డంతో సంతానోత్పత్తికి అనుకూలమైన ప్రదే శాలు కూడా తగ్గుతున్నట్టు నిపుణులు గుర్తించారు. దసరా రోజు సాయంత్రం జమ్మి పూజ అనంతరం పాలపిట్టను చూస్తే విజయాలు, శుభాలు కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. అందుకే ఈ పక్షి తెలంగాణ సంస్కృ తిలో కేవలం ఒక పక్షిగా కాకుండా దసరా సంప్రదాయంలో భాగంగా మారింది. దసరా సందర్భంగా పాలపిట్టను…
శామీర్‌పేట్/ చేవెళ్ల, వెలుగు: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. జార్ఖండ్ కు చెందిన సుమిత్ కుల్లు (22), ఇతడి స్నేహితుడు కాస్మోస్ మార్కి (22) ఆదివారం తమ కంపెనీలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకలు ముగిశాక బైక్‌పై బయటకు వెళ్లగా అలియాబాద్ బృంద కన్వెన్షన్ హాల్ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నాంచేరి గ్రామానికి చెందిన రైతు అలూరి కిష్టయ్య(42) బైక్‌పై ఆలూరుకు వెళ్తుండగా.. మరో బైక్ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో కిష్టయ్య మృతిచెందగా.. మరొక వ్యక్తి మహిపాల్‌కు గాయాలయ్యాయి. అలాగే, శంకర్పల్లి మండలం సింగాపురానికి చెందిన బండారి మొగులయ్య (48) ఆదివారం రాత్రి బైక్‌పై సంగారెడ్డి వైపు వెళ్తున్నాడు. కంది బైపాస్‌లోని ల్యాంకో సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉన్న చోట బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతని తలపై నుంచి వెళ్లడంతో…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.