We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మహిళా సైక్లిస్టులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆస్మిత ఖేలో ఇండియా ఉమెన్ సైక్లింగ్ పోటీల్లో పతకాలు సాధించారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 16 : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆస్మిత ఖేలో ఇండియా ఉమెన్ సైకిలింగ్ (సౌత్ ఇండియా జోన్) క్రీడా పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహిళా క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. ఈమేరకు ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సైకిలింగ్ క్రీడకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందనీ, ఈ క్రీడలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు.
అంతేగాక పోటీల్లో పతకాలు సాధించిన మహిళలకు రైల్వే, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీస్ శాఖతోపాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైకిలింగ్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కాంతారావు, కోచ్ చంద్రారెడ్డి, మ్యాక్స్ వెల్ పెద్దపల్లి జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ తగరపు శంకర్, కరీంనగర్ జిల్లా…
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా తేజ సజ్జ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, రానా, నాని వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డిసెంబర్ 2026లో ఉదయ్‌పూర్‌లో తేజ సజ్జ వివాహం జరగనుందని కథనాలు పేర్కొన్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్వాన్ తుపానుగా మారనుందని ప్రకటించింది. ఈ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
The article reports that BM Sandeep has been appointed as the new Telangana Congress state in-charge by AICC President Mallikarjun Kharge. He replaces Meenakshi Natarajan, who was serving in the role.
హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లి వార్తలతో అభిమానుల్లో ఆసక్తి రేపిన ఈ హీరో.. తాజాగా తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో జరిగిన నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సందడి చేశారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వేగంగా బలపడి అక్వాన్ తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం, నవంబర్ 15 సాయంత్రం 5:30 గంటల సమయానికి విశాఖపట్నానికి దక్షిణ-ఆగ్నేయంగా 920 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 16 సాయంత్రానికల్లా తుపానుగా, నవంబర్ 17 సాయంత్రం నాటికి తీవ్ర తుపానుగా మారనుందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత మరింత…
ఏపీ, ఒడిశా తీరాలకు ముందస్తు హెచ్చరికతుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదులుతున్న నేపథ్యంలో, ఏపీతో పాటు సమీపంలోని దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఐఎండీ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. తుపాను తీరం దాటే ప్రదేశం, దాని కచ్చితమైన తీవ్రతపై రాబోయే ఒకటి, రెండు రోజుల్లో మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత నమూనాల ప్రకారం, ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపే పయనించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వారు వ్యవహరించిన తీరు రాష్ర్టానికి తీరని అవమానమని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు. టీ కాంగ్రెస్, బీజేపీ నేతల్లో ఉన్నత పదవులకు ఉండాల్సిన హుందాతనం కరువైందని దుయ్యబట్టారు. గాంధీలకు బాడీగార్డులా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించడం, రాహుల్‌గాంధీ బైక్ వెంట మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పనివాళ్ల మాదిరిగా పరుగులు తీయడం అవమానకరమని మండిపడ్డారు. అమిత్‌షా కాళ్లు మొక్కుతూ, ఆయన వెంట పరుగెడుతూ, చెప్పులు తీసుకెళ్లిన బీజేపీ…
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ యువత భవిష్యత్తుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. నిరుద్యోగ యువత కష్టానికి తగిన ఫలితం దకాలని, వారు ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ కుటుంబాల ఆశయాలను నెరవేర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వివిధ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం రూపొందించిన కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్‌ను కేటీఆర్ తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ మెటీరియల్ విద్యార్థుల ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగార్థులకు కేవలం మాటలతో భరోసా ఇవ్వడమే కాకుండా, వారి లక్ష్యసాధనకు అవసరమైన…
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీకి ముప్పు పొంచి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ తుఫాను అక్వాన్ అని పేరు పెట్టింది ఐఎండీ. ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి నవంబర్ 20 నాటికి ఉత్తర కోస్తాంధ్ర తీరాన్ని దాటే ఉందని... దీని ప్రభావంతో నవంబర్ 20 నుంచి 22 వరకు తూర్పు తెలంగాణ, దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 21, 22 తేదీల్లో ఇతర జిల్లాల్లో కూడా తుపాను ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ.
తుఫాను ప్రభావం ఏపీలోని కోస్తా తీరంపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రానున్న 24 గంటల్లో తుఫానుగా బలపడనున్న వాయుగుండం మంగళవారం నాటికి తీవ్ర తుఫానుగా బలపడుతుందని తెలిపింది.
ఖమ్మం టౌన్/దమ్మపేట వెలుగు : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాల అమలు ఖర్చులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారుల సంఖ్య 45 లక్షలకు చేరిందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానుండగా, డిసెంబర్ 9న ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ఇందిరమ్మ మోడల్ కాలనీతో పాటు మున్నేరు కేబుల్ బ్రిడ్జి, మిర్చి మార్కెట్, మెడికల్ కళాశాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిదని, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ‘అభయ హస్తం’లో పేరొన్న 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీ రాష్ట్ర ఖజానా ఖర్చుతో హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలపై కూడా సమాధానం చెప్పాలని శనివారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘అబద్ధాలు.. పచ్చి అబద్ధాలు.. వీటన్నింటికీ మించి కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అభయహస్తం’ అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ వివిధ వర్గాలకు భారీ హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరించిందని విమర్శించారు.
హైదరాబాద్ : ఇటీవల ప్రచురితమైన సోనియా గాంధీ ( Sonia Gandhi ) ఆత్మకథ లో తెలంగాణ ( Telangana ) గురించి రాయకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ( Vinod Kumar) అన్నారు. దశాబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం, ఎందరో బలిదానాలు, కేసీఆర్ అకుంఠిత దీక్షతో సాధించుకున్న తెలంగాణ గురించి ఆ పుస్తకంలో ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఆత్మకథ కాదు తెలంగాణ ప్రజల బలిదానాలు తీసుకున్న ప్రేతాత్మ కథ అని విమర్శించారు.
తెలంగాణ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. నవంబర్ 29 యావత్ తెలంగాణ ఎప్పటికీ మర్చిపోలేని రోజని గుర్తు చేశారు. తెలంగాణ బానిస సంకెళ్లు తెంపిన రోజు ఇప్పటి తరానికి తెలంగాణ ఉద్యమం గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
గిగ్ వర్కర్ల పూర్తి సమాచారం ఇకపై మొబైల్ ఫోన్లోనే చూసుకోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమంపై హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ప్రతి గిగ్ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. గిగ్ వర్కర్లకు పెన్షన్, సామాజిక భద్రత కల్పిస్తామని, ప్రతి రైడ్, డెలివరీ లావాదేవీపై 1 శాతం నిధులు గిగ్ వర్కర్ల సంక్షేమానికి కేటాయిస్తామని.. కంపెనీలు చెల్లించే 1 శాతం నిధులు వర్కర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వివరించారు.
గిగ్ వర్కర్ల బోర్డు ద్వారా నేరుగా ఖాతాల్లోకి డబ్బులు పడతాయని, గిగ్ వర్కర్ల పూర్తి సమాచారం ఇకపై మొబైల్ ఫోన్లోనే చూసుకునే వెసులుబాటు తెలంగాణలోని గిగ్ వర్కర్లకు అందుబాటులోకి తీసుకొస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రతి నగరంలో ప్రత్యేక రెస్ట్ జోన్లు ఏర్పాటు చేశామని, వై-ఫై సౌకర్యంతో విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. రెస్ట్ జోన్లలో వాహనాల పార్కింగ్, నిద్రించేందుకు అవకాశం ఉందని చెప్పారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.