Andhra Jyothy ·
తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
Home » Andhra Pradesh » Chittoor » CM Chandrababu Naidu Praises Jain Couple for Massive Gold Donation to Tirumala Temple VK
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:32 PM
Trending search
5 analysed of 5 matched articles · 3 outlets · last listed 26 Nov 2026 15:12 IST
Data source: Google Trends — search attention, not opinion
This search term is no longer in Google’s trending list. The page stays up; it is no longer refreshed.
n = 5 analysed articles from 3 outlets
AI-estimated tone of each outlet's article. It is not a judgement of the story, of anyone in it, or of what is true.
Andhra Jyothy
తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల ఆలయానికి చెన్నైకి చెందిన జైన్ దంపతులు సమర్పించిన 121 కిలోల బంగారు ఆభరణాలను స్వీకరించిన సందర్భంగా మాట్లాడారు. 200 కోట్ల విలువైన విరాళాన్ని అపూర్వమైన సంఘటనగా అభివర్ణించారు.
Eenadu
Chandrababu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు
Andhra Jyothy ·
Home » Andhra Pradesh » Chittoor » CM Chandrababu Naidu Praises Jain Couple for Massive Gold Donation to Tirumala Temple VK
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:32 PM
Eenadu ·
తిరుమల: తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్ద తితిదే ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, అర్చకులు సీఎం దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని చంద్రబాబు, భువనేశ్వరి దర్శించుకున్నారు. రంగనాయకుల మండలంలో వారికి అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు; తితిదే అధికారులు వారిని ఆలయ మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండలం వద్ద అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.
Namasthe Telangana
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
10 లక్షలు పరిహారం అందిస్తున్నారు. 2 లక్షల బీమా పరిహారాన్ని అందజేశారు. మిగిలిన వారికి కూడా త్వరలో అందిస్తామని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Eenadu ·
తిరుమల: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించారు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్దమాన్ జైన్.. 121 కిలోల బంగారు ఆభరణాలకు సంబంధించిన పత్రాలను తితిదే అదనపు ఈవో వెంకయ్యచౌదరికి అందజేశారు. ఆభరణాలను ట్రంకు పెట్టెల్లో శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.
వర్ధమాన్జైన్.. 2025 జనవరి 19న స్వామి వారికి రూ.6 కోట్లు, మే 16న ఎలక్ట్రిక్ బస్సును ఆయన విరాళంగా అందజేశారు. తాజాగా ఇచ్చిన 121 కిలోల ఆభరణాల్లో 47 రకాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.206 కోట్ల వరకు ఉంటుందని అంచనా. శ్రీవారు నిత్యం సుమారు 120 కిలోల మేర ఆభరణాలు ధరిస్తారు. ఈ నేపథ్యంలో 121 కిలోల బంగారు నగలను భక్తుడు సమర్పించారు.
Namasthe Telangana ·
తిరుమల : దేశంలోనే తొలిసారిగా తిరుమల ( Tirumala ) శ్రీవారి భక్తులకు శ్రీవారి యాత్ర సురక్ష పేరుతో తీసుకొచ్చిన బీమా పథకాన్ని ( Insurance scheme) టీటీడీ ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుమలలో మరణించిన భక్తుల కుటుంబ సభ్యులకు బీమా కింద రూ.2 లక్షల పరిహారాన్ని ( Compensation ) మంగళవారం టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ శ్రీవారి యాత్ర సురక్ష’ ( Srivari Suraksha Yatra ) పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా భక్తులకు భరోసా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచచ్చి సహజంగా మరణించిన ఏడుగురు కుటుంబ సభ్యులకు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా సీఈవో , ఎండీ ఆర్.దొరైస్వామిలతో కలిసి మంగళవారం రూ.2 లక్షలు బీమా పరిహారాన్ని అందజేశారు.
Eenadu ·
తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంక్షేమానికి తితిదే (TTD) విశేషంగా కృషి చేస్తోంది. ఇప్పటివరకు ప్రమాదాలకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని విస్తరించి, తొలిసారిగా సహజ మరణాలకు కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తిరుమలలో సహజ మరణానికి రూ.2 లక్షల బీమా ప్రయోజనం అందించే పథకాన్ని తితిదే తొలిసారిగా అమల్లోకి తెచ్చింది. శ్రీవారి భక్తులకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకం ద్వారా దేశంలోనే తొలిసారిగా భరోసా కల్పిస్తున్నట్లు తితిదే సాధికారిక మండలి ఛైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. గత రెండు నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేసి సహజంగా మరణించిన ఏడుగురు భక్తుల…
ఈ సందర్భంగా ఈవో రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న ఈ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. దేశానికే ఆదర్శవంతంగా ఉండేలా శ్రీవారి యాత్ర సురక్ష పథకాన్ని రూపొందించామన్నారు. సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. గత రెండు నెలల్లో 17 మంది భక్తులు తిరుమలలో మరణించారని, వారిలో ఏడుగురి సభ్యులకు బీమా పరిహారాన్ని అందించామన్నారు. మిగిలిన వారికి త్వరలో అందిస్తామని తెలిపారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. దేశానికి ఆదర్శవంతంగా ఉండేలా ఈ బీమా పథకాన్ని తీసుకొచ్చేందుకు ఏడదిన్నర పాటు కృషి చేసినట్టు చెప్పారు. తితిదే కోసం ఈ బీమా పథకాన్ని…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.