We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Paramjeet Dhankar, a former Asian head of Tech Mahindra, was shot and killed by his neighbor Monu Sharma in Faridabad, Haryana, following a parking dispute.
న్యూఢిల్లీ : టెక్ మహీంద్రా ఆసియా మాజీ హెడ్ పరమ్‌జీత్ ధన్కర్ ఫరీదాబాద్(Faridabad Murder)లో తన పొరుగింటి వ్యక్తి జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే సీసీటీవీకి ఆ కాల్పుల ఘటన చిక్కింది. ఆ వీడియోను ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేశారు. నిందితుడు మోనూ శర్మ, పరమ్‌జీత్ మధ్య పార్కింగ్ అంశంలో వాగ్వాదం జరిగినట్లు వీడియోలో ఉన్నది. పరమ్‌జీత్ మాట్లాడుతున్న సమయంలో.. గన్ తీసి మోనూ శర్మ ఫైరింగ్‌కు పాల్పడ్డాడు. పక్కనే ఉన్న పరమ్‌జీత్ కుమారుడు భయంతో పరుగులు తీశాడు. మోను తన లైసెన్స్డ్ తుపాకీతో 15 రౌండ్లు కాల్చగా, 9 తూటాలు పరమ్‌జీత్‌కు తగిలాయి.
టీషర్ట్ ధరించిన మోనూ శర్మ తన ప్యాంటు జేబులో నుంచి గన్ తీసి అకస్మాత్తుగా ఫైరింగ్ చేశాడు. 5 సెకన్లలో మల్టిపుల్ రౌండ్లు కాల్చాడు. టెకీ మహేంద్ర మాజీ ఉద్యోగి పరుగులు తీస్తున్నా.. నిందితుడు శర్మ మాత్రం బుల్లెట్ల వర్షం కురిపించాడు. బిల్డింగ్ గేటు తీసి బాధితుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా అతన్ని నిందితుడు వదిలిపెట్టలేదు. కుప్పకూలిన పరమ్‌జీత్ వద్దకు ఓ వృద్ధ మహిళ వచ్చి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. మళ్లీ గన్ను రీలోడ్ చేసిన మోనూశర్మ .. పరమ్జీత్పై కాల్పులు జరిపాడు. ఫైరింగ్ చేస్తున్న సమయంలో నిందితుడు హ్యాపీ దీపావళి, ముబారక్ అని అరిచాడు. అందర్నీ…
According to the New York Times and Wall Street Journal, Nvidia CEO Jensen Huang is alleged to have had an extramarital affair with Kimberly Powell, the company's healthcare vice president.
8 lakh by cybercriminals who tricked him into sharing his bank account details over the phone. The victim, Muralidhar Rao, subsequently met with Union Minister Bandi Sanjay to seek help in recovering his money.
న్యూఢిల్లీ: అమెరికా చిప్ తయారీ కంపెనీ ఎన్వీడియా సీఈవో జేన్సన్ హువాంగ్‌పై చర్యలు తీసుకునేందుకు ఆ కంపెనీ బోర్డు సిద్దమైనట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. చైనీస్ గూఢాచారితో పాటు మరో మహిళతోను సీఈవో జేన్సన్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. త్వరలోనే కంపెనీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారని ఆ నివేదికలో వెల్లడైంది. ఒకవేళ హువాంగ్ను తప్పిస్తే, అప్పుడు సుమారు 4 ట్రిలియన్ల డాలర్ల చిప్ తయారీ కంపెనీ భవితవ్యం ఆగమ్యగోచరంగా మారనున్నది. జేన్సన్ అఫైర్ వార్తలు బయటకు పొక్కడంతో ఆ కంపెనీ షేర్లు అమాంతం 8 శాతం పడిపోయాయి. ఈ వారంలోనే ఆ…
హువాంగ్ను తక్షణమే తొలగించలేని పరిస్థితిలో ఆ కంపెనీ ఉన్నది. ఎందుకంటే ఆయనకు వారసుడిగా ఎవర్ని ప్రకటించాలన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ కంపెనీ విధానాలను కానీ, చట్టాలను కానీ హువాంగ్ ఉల్లంఘించినట్లు రుజువైతే, దానికి తగిన ఆధారాలు ఉంటే, ఆయనపై చర్యలు తీసుకుంటామని టెక్నాలజీ రీసర్చ్ హెడ్ గిల్ లూరియా తెలిపారు. చైనీస్ గూఢాచారిణి అలిస్ హువాంగ్‌తో పాటు కంపెనీలో పనిచేసే ఓ ఎగ్జిక్యూటివ్ మహిళతోనూ హువాంగ్ రిలేషన్లో ఉన్నట్లు ఊహాగానాలు వ్యాపించాయి. ఎన్వీడియా హెల్త్‌కేర్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా చేస్తున్న కింబర్లే పావల్తో జేన్సన్ రిలేషన్లో ఉన్నట్లు అమెరికా మీడియా…
ఇంటర్నెట్‌డెస్క్: ఎన్విడియా (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్ (Jensen Huang) ప్రేమాయణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఎన్విడియా (Nvidia) హెల్త్‌కేర్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో కూడా ఆయనకు ‘సన్నిహిత’ సంబంధం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక బాంబు పేల్చింది. ఇప్పటికే చైనా గూఢచారి అలిస్ హువాంగ్‌తో సంబంధాన్ని అంగీకరించిన జెన్సన్కు ఇదో షాక్. దీంతో ఎన్విడియా (Nvidia) బోర్డు ఆయన్ను సీఈవో పదవి నుంచి తప్పించేందుకు యోచిస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. కంపెనీ బోర్డు నేడు సమావేశం కానుందన్న వార్తలతో వాల్‌స్ట్రీట్‌లో పోస్ట్ ట్రేడింగ్ అవర్స్‌లో…
ఎన్విడియా (Nvidia) హెల్త్‌కేర్ వైస్‌ప్రెసిడెంట్ 48 ఏళ్ల కింబర్లీ పావెల్‌తో 63 ఏళ్ల జెన్సన్ సన్నిహిత సంబంధం నడుపుతున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కంపెనీలో పనిచేసిన ఉద్యోగులను ఉటంకిస్తూ ఈ కథనం వెలువరించింది. ఆమెకు ఇప్పటికే వేరే వ్యక్తితో వివాహం కూడా జరిగింది. ఈ ఏడాది మార్చిలో కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరిగిన ఎన్విడియా కార్యక్రమం సందర్భంగా హువాంగ్, కింబర్లీ ఓ హోటల్లో సన్నిహితంగా ఉండటాన్ని ఓ వ్యక్తి వీడియో తీశారు. వెంటనే హువాంగ్ (Jensen Huang) భద్రతా సిబ్బంది అతడిని పట్టుకొని.. ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండేలా ఓ ఒప్పందంపై బలవంతంగా సంతకం చేయించుకొన్నారు. ఈ విషయంపై సదరు పత్రిక…
ఈనాడు, హైదరాబాద్: బాధ్యతగా మెలగాల్సిన విద్యావంతులే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించటం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరమని నగర సీపీ వీసీ సజ్జనర్ ఆందోళన వెలిబుచ్చారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో బ్యాంకు ఉద్యోగి ధర్మరాజు రాంగ్రూట్లో ద్విచక్రవాహనం నడుపుతూ ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థిని అయిషా ముస్ఫీరా(21) ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాడు. ఈ ఘటనపై సీపీ సజ్జనర్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. అప్పటివరకూ నవ్వుతూ తనతో మాట్లాడుతూ ప్రయాణించిన కన్నబిడ్డ క్షణాల్లో బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోవటంతో తల్లడిల్లిపోయారన్నారు. రెండు నిమిషాల సమయం ఆదా చేయాలనే తొందరపాటు ఒక ఇంటి దీపాన్ని…
Hyderabad Accident | రాంగ్ రూట్లో బైక్ నడిపిన ఎస్బీఐ ఉద్యోగి నిర్లక్ష్యం ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణం తీసింది. తండ్రితో కలిసి కళాశాలకు వెళ్తున్న 21 ఏళ్ల యువతి.. ఎదురుగా వేగంగా వచ్చిన అతడి ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు కిందపడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడిక్కడే మృతి చెందింది. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని హఫీజ్నగర్కు చెందిన మహ్మద్ ఆరీఫ్ కుమార్తె షేక్ ఆయిషా ముస్ఫిరా (21) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ మైనింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఆరీఫ్ తన కుమార్తెను ద్విచక్రవాహనంపై కళాశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఫీవర్ ఆసుపత్రి సిగ్నల్స్ వద్ద షైలా కేఫ్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో ఎదురుగా రాంగ్ రూట్లో మరో వ్యక్తి వేగంగా బైక్‌పై దూసుకొచ్చాడు.
కరీంనగర్లో సైబర్ ఫ్రాడ్ తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.10 లక్షల 80 వేలు కాజేశారు సైబర్ మోసగాళ్లు. వివరాల ప్రకారం.. మురళీధర్ రావు రిటైర్డ్ ఇరిగేషన్ ఉద్యోగి. నవంబర్ 1వ తేదీన ఆయనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లైఫ్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలంటూ మభ్యపెట్టిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలు కూపీ లాగారు.
సైబర్ నేరగాళ్లు మాటలు నమ్మిన మురళీధర్ రావు కొన్ని వివరాలు వారికి చెప్పాడు. ఆ తర్వాత అనుమానం రావడంతో అప్రమత్తమయ్యాడు. ముందు జాగ్రత్తలో భాగంగా తన అకౌంట్లోని రూ.20 లక్షల 80 వేలల్లో రూ.10 లక్షలు తన భార్య పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. మురళీధర్ రావు అకౌంట్లోని మిగతా రూ.10 లక్షల 80 వేలను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.