We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
కురవి, న్యూస్‌టుడే: ఈ చిత్రంలో కనిపిస్తున్న రేకుల గదికి నెలకు అద్దె రూ.2.12 లక్షలు పలికింది. మహబూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ముందు తూర్పు రాజగోపురం పక్కన కొన్నేళ్ల క్రితం కొబ్బరికాయలు, పూజా సామగ్రిని విక్రయించేందుకు ఇటుకలు, రేకులతో గదిని నిర్మించారు. అధికారులు శనివారం ఆలయం ఎదుట ఉన్న గదులను అద్దెకు ఇచ్చేందుకు వేలం నిర్వహించారు. పలువురు వ్యాపారులు పోటీ పడటంతో ఈ రేకుల గదికి నెలకు రూ.2.12 లక్షల అద్దె చొప్పున చెల్లించేందుకు కురవికి చెందిన బండారి రమేశ్ దక్కించుకున్నారు. గతేడాది ఈ దుకాణానికి నెల అద్దె 93,600 వచ్చింది
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం దసరా పండుగ సందర్భంగా జరగాల్సి ఉండగా, నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ ఆసుపత్రి పనులు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయని నివేదిక పేర్కొంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై డివైడర్లకు రంగులు వేసే పనులు జరుగుతుండటంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని ప్రారంభించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టిమ్స్ నిర్మాణ పనులు కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. దీంతో గత దసరా పండుగ సందర్భంగా ప్రారంభించాలని భావించిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరానాడు ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆయా విభాగాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఉన్న పళంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది.
దవాఖాన పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో ప్రారంభోత్సవం విషయంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టు సమాచారం. కాగా, టిమ్స్-అల్వాల్ను ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి పరిశీలించిన సందర్భంలో 95% పనులు పూర్తయ్యాయని చెప్పారు. తాజాగా ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో జూన్ 2 కల్లా వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లను పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో 95% పనులు పూర్తయిన అల్వాల్ టిమ్స్ ప్రారంభోత్సవానికి సైతం ఆరు నెలలు ఆగాల్సిన పరిస్థితి నెలకొన్నది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘట్కేసర్ ప్రధాన కూడలి వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్లకు రంగులు వేసే పనులు చేపట్టడంతో ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రహదారిపై పనులు జరుగుతున్నప్పటికీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఘట్కేసర్ ప్రధాన కూడలి నుంచి పరిసర ప్రాంతాల వరకు వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలతో పాటు హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిదూరం ప్రయాణించేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.