Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఘట్ కేసర్ దగ్గర వరంగల్ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై డివైడర్లకు రంగులు వేసే పనులు జరుగుతుండటంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తగిన ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘట్కేసర్ ప్రధాన కూడలి వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి మధ్యలో ఉన్న డివైడర్లకు రంగులు వేసే పనులు చేపట్టడంతో ఈ ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రహదారిపై పనులు జరుగుతున్నప్పటికీ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఘట్కేసర్ ప్రధాన కూడలి నుంచి పరిసర ప్రాంతాల వరకు వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలతో పాటు హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిదూరం ప్రయాణించేందుకు కూడా ఎక్కువ సమయం పడుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)