We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
[PUBLISHER] reported that Telangana Agriculture Minister Tummala Nageswara Rao advised farmers to cultivate drought-resistant crops for the upcoming Yasangi season.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగిలో కరువును దృష్టిలో పెట్టుకొని పంటల సాగు చేపట్టాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. ఎక్కువ శాతం ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని కోరారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో రానున్న యాసంగిలో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చిరుధాన్యాలు, పశుగ్రాస పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో పంటలకు నష్టం వాటిల్లకుండా పంట కోతలను తాతాలికంగా వాయిదా వేసుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
Farmers in Bhimadevarapalli, Warangal, are anticipating significantly higher paddy yields this monsoon season, with reports suggesting 40-50 bags per acre compared to the usual 25-30 bags.
పెన్పహాడ్, నవంబర్ 03 : మురాసు తుఫాన్ ప్రభావంతో వీచిన బలమైన గాలులకు పెన్పహాడ్ మండల వ్యాప్తంగా వరి చేలు నేలకొరిగాయి. అర్నబ్ తుఫాన్ దెబ్బ నుండి కోలుకోకముందే ఇప్పుడు మరో తుఫాన్ మురాసు ప్రభావం వల్ల మంగళవారం కురిసిన వర్షం, గాలులకు చేతికొచ్చిన పంట పొలాలకు నేల వాలాయి. అన్నదాతలు సాగునీటి కష్టాలు ఎదుర్కొని మండల వ్యాప్తంగా సుమారు 5 వేల ఎకరాలలో వరి పండించారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ దశలో వరుస తుఫాన్లు రైతులను కలవరపెడుతున్నాయి. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు ముంపునకు గురై దెబ్బతిన్నాయి. ఇప్పుడు మురాసు తుఫాన్ వచ్చి నిండా రైతులను ఆగం…
పంట చేతికొచ్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సాగు కోసం భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులకు పంట నేలకొరగడంతో ఆర్థికంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కష్టపడి సాగు చేసిన పంట గాలుల ప్రభావంతో దెబ్బతినడంతో పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరువు మండలంగా ప్రకటించిన పెన్పహాడ్ మండలంలో తుఫాన్ ప్రభావం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతినడం రైతులకు తీవ్ర భారంగా మారింది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట…
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.