Eenadu ·
Cyclone Murasu: తుపాను నేపథ్యంలో విజయవాడ డివిజన్లో పలు రైళ్లు రద్దు
విజయవాడ: మురసు తుపాను నేపథ్యంలో మంగళవారం విజయవాడ - గూడూరు మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు. రైల్వే ట్రాక్‌పై నీళ్లు నిలవడం, విద్యుత్తు వైర్లు తెగిపడడంతో ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లు ఆలస్యంగా విజయవాడకు వచ్చాయి. ఉదయం రావాల్సిన రైళ్లు రాత్రికి చేరుకున్నాయి. చెన్నై నుంచి వచ్చే పలు రైళ్లను అప్పటికప్పుడు దారి మళ్లించారు. కృష్ణ కెనాల్ జంక్షన్ వద్ద కొన్ని రైళ్లను గంటల తరబడి నిలిపివేశారు. తాగునీరు, ఆహారం అందక వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. చాలా మంది ప్రయాణికులు రోడ్డు మార్గంలో గమ్యస్థానాలకు…
17256 లింగంపల్లి- నరసాపురం, 17237/17238 బిట్రగుంట- చెన్నై సెంట్రల్, 67260 బిట్రగుంట- విజయవాడ, 67258 విజయవాడ- నరసాపురం, 12743/17244 విజయవాడ- గూడూరు, 17281/17282 నరసాపురం- గుంటూరు వెళ్లాల్సిన రైళ్లు రద్దయ్యాయి.