We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Farooq Abdullah stated at a National Conference meeting in Baramulla that Pakistan's diplomatic efforts on Kashmir's behalf have kept the region safe, while accusing the BJP-led central government of neglecting Jammu and Kashmir and failing to restore statehood.
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం (అక్టోబర్ 24) ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి పాకిస్తాన్ చేస్తున్న దౌత్య ప్రయత్నాల వల్లే జమ్మూ కాశ్మీర్ ప్రజలు సురక్షితంగా ఉంటున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
కాశ్మీరీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాలు సరిగ్గా లేవని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. కాశ్మీరీల సమ్మతి తీసుకోకుండా జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు.
Bhuvneshwar Kumar: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లోకి భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు. ఐపీఎల్లో వరుసగా రెండు సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టులోకి ఎంపికైన 36 ఏళ్ల భువీకి, ఈ రీ-ఎంట్రీ మ్యాచ్ ఏమాత్రం ఆశాజనకంగా కొనసాగలేదు. తొలి టీ20లో తన 4 ఓవర్ల స్పెల్‌లో ఏకంగా 49 రన్స్ సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. అంతటి అనుభవం ఉన్న బౌలర్ ఈ మ్యాచ్‌లో రెండు నో-బాల్స్ వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో భువీతో సుదీర్ఘకాలం కలిసి పని చేసిన మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) క్రిక్‌బజ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Analysis pending
Rahul Sankrityan | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని అనంతపురంలో ‘రణబాలి రణభేరి’ పేరుతో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాపై కొందరు కావాలనే ప్రతికూల ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.
అనంతపురంలో జరిగిన వేడుకలో రాహుల్ సాంకృత్యాన్ మాట్లాడుతూ.. తనకు అనంతపురంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘నేను ఇక్కడే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. ఇక్కడి థియేటర్లలోనే ‘ఇంద్ర’, ‘నరసింహ నాయుడు’ వంటి సినిమాలు చూశాను. రాప్తాడు రోడ్డులో కెమెరా పట్టుకుని షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఒక సినిమాను ఎలా తీయాలో, ఎలా తీయకూడదో ఇక్కడే నేర్చుకున్నాను. దర్శకుడిగా నా ప్రయాణం ప్రారంభమైన ప్రాంతం అనంతపురం. ఇప్పుడు ఇదే ప్రాంతంలోని థియేటర్లలో నా సినిమా హౌస్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతుండటం ఎంతో గర్వంగా ఉంది’’ అని అన్నారు.
Samantha calls CM Vijay her lucky charm: ఆయన నా లక్కీ ఛార్మ్.. సీఎం విజయ్‌పై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Analysis pending
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు సీఎం, అగ్ర నటుడు విజయ్ (Vijay)పై ప్రముఖ నటి సమంత (Samantha) ప్రశంసలు కురిపించారు. ఆయన తన ‘లక్కీ ఛార్మ్’ అని తెలిపారు. వారిద్దరూ కలిసి నటించిన మూడు సినిమాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయని ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సమంత ‘సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళం’ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఈ షోలోని ఒక ఎపిసోడ్లో ఆర్జే విజయ్.. సమంతని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీకు ఇష్టమైన స్టార్ ఎవరు అని అడగ్గా.. ఆమె ఏమాత్రం తడబడకుండా వెంటనే విజయ్ పేరు చెప్పారు. ‘‘విజయ్ సర్ నా లక్కీ ఛార్మ్. ఆయనతో కలిసి నేను ‘కత్తి’, ‘తెరి’ (తెలుగులో పోలీసోడు), ‘మెర్సల్’ (అదిరింది) సూపర్ హిట్ చిత్రాల్లో నటించాను’’ అని జవాబిచ్చారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. ‘మెర్సల్’ రూ.250 కోట్ల మార్కును దాటింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. విజయ్ను తన 'లక్కీ చార్మ్’గా అభివర్ణించిన సమంత.. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టిన తీరును ప్రశంసించారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్న సమంత 'సెలబ్రిటీ మాస్టర్‌షెఫ్ తమిళ్' టీవీ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తూ అలరిస్తున్నారు. ఓ ఎపిసోడ్లో 'హీరో వర్సెస్ విలన్' ఛాలెంజ్ సందర్భంగా ఆర్జే విజయ్.. మీకు ఇష్టమైన స్టార్ ఎవరు? అని ప్రశ్నించగా, సమంత ఏమాత్రం తడబడకుండా విజయ్ పేరు చెప్పారు.
Shivam Dube, Hardik Pandya Trade: ఐపీఎల్ 2027 (IPL 2027) మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) జట్లకు భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) ఆసక్తికరమైన సలహా ఇచ్చారు. 2023లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 5వ ట్రోఫీ నెగ్గిన తర్వాత గత మూడు సీజన్లుగా చెన్నై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ట్రేడింగ్ ద్వారా చెన్నైలోకి తీసుకుని, బదులుగా శివమ్ దూబేను (Shivam Dube) ఇచ్చేయాలని శ్రీకాంత్ ప్రతిపాదించారు.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.