Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
2027లో వర్షాల జోరు.. ఎల్‌నినోకు ఎండ్ కార్డు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) తాజా అంచనాల ప్రకారం, 2027 మార్చి నాటికి పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో బలహీనపడి లానినాకు మారే అవకాశాలు ఉన్నాయి.
దీనివల్ల భారత్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే వ్యవసాయం, నీటి వనరులు, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేంద్రం తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: అనూహ్యంగా మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 2027 నైరుతి రుతుపవనాలపై ఆశాజనక సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా కొనసాగుతున్న ఎల్‌నినో వచ్చే ఏడాది మార్చి నాటికి బలహీనపడి, ఆ తర్వాత లానినాకు మారే అవకాశాలు ఉన్నట్లు శాస్తవ్రేత్తలు అంచనా వేస్తున్నారు. లానినా ఏర్పడితే భారత్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) తాజా అంచనాలు ఈ ఆశలను పెంచుతున్నాయి.
మార్చి వరకు ఎల్‌నినో పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు భూమధ్యరేఖ ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే పరిస్థితిని ఎల్‌నినో అంటారు. ఇది సాధారణంగా భారత రుతుపవనాల బలహీనతకు దారితీస్తుంది. అక్టోబర్ 2026లో ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. సముద్ర అంతర్భాగంలోనూ కొన్ని ప్రాంతాల్లో నాలుగు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఎల్‌నినో మరింత బలపడుతున్నట్లు శాస్తవ్రేత్తలు గుర్తించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)