Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
3 నెలల్లో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.200 కోట్లు సంపాదించాలి: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన క్రెడిట్ కార్డ్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగాల ద్వారా ప్రతి 3 నెలలకు రూ.200 కోట్ల లాభాన్ని సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
PNB ఎండీ అండ్ సీఈఓ అశోక్ చంద్ర ఈ లక్ష్యాన్ని వెల్లడించారు.
ట్రెజరీ ఆదాయం, లోన్ రికవరీల్లో సవాళ్లు ఉండవచ్చని అంచనా వేసిన నేపథ్యంలో నాన్-ఇంటరెస్ట్ ఆదాయాన్ని బలోపేతం చేసుకోవాలని బ్యాంక్ నిర్ణయించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగాల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 3 నెలలకు రూ.200 కోట్ల లాభం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే క్రెడిట్ కార్డుల నుంచి ఏ రేంజ్లో ఆదాయం రాబట్టాలనే ఈ నిర్ణయంతో స్పష్టం అయ్యింది. ఈ విషయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అశోక్ చంద్ర స్వయంగా వెల్లడించారు.
ఫీ-బేస్డ్ ఆదాయాన్ని పెంచుకోవడానికి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్.. ఈ మూడు విభాగాలకు విడివిడిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు నిర్మించిందని, ప్రతి విభాగానికి జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని బాధ్యుడిగా నియమించిందని అశోక్ చంద్ర వెల్లడించారు. ట్రెజరీ ఆదాయం, లోన్ రికవరీల్లో సవాళ్లు ఉండవచ్చని అంచనా వేసిన నేపథ్యంలో నాన్-ఇంటరెస్ట్ ఆదాయాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)