Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
52 లక్షల పెండ్లిళ్లు.. 7.5 లక్షల కోట్ల వ్యాపారం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) అంచనా ప్రకారం, ఈనెల 21 నుంచి డిసెంబర్ 15 వరకు కొనసాగనున్న పెండ్లి సీజన్లో దేశవ్యాప్తంగా 52 లక్షల పెండ్లిళ్లు జరగవచ్చని, దీని ద్వారా రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం సాగవచ్చని పేర్కొంది.
25 రోజుల ఈ సీజన్‌తో రిటైల్, తయారీ, ఆతిథ్యం, రవాణా, ఆహారం, నగలు తదితర రంగాల్లో డిమాండ్ పెరుగుతుందని సీఏఐటీ తెలిపింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే రూ.2.5 లక్షల కోట్ల వ్యాపారం నమోదవుతుందని పేర్కొన్నది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)/ న్యూఢిల్లీ : ఈనెల 21 నుంచి డిసెంబర్ 15 వరకు కొనసాగనున్న పెండ్లి సీజన్లో దేశవ్యాప్తంగా 52 లక్షల పెండ్లిళ్లు జరగవచ్చని, రోజుకు సగటున రెండు లక్షలకు పైగా పెండ్లిళ్లతో రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం సాగవచ్చని అఖిల భారత వర్తకుల సమా ఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. 25 రోజుల ఈ సీజన్‌తో రిటైల్, తయారీ, ఆతిథ్యం, రవాణా, ఆహారం, నగలు తదితర రంగాల్లో డిమాండ్ పెరుగుతుందని సీఏఐటీ తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోనే రూ.2.5 లక్షల కోట్ల వ్యాపారం నమోదవుతుందని పేర్కొన్నది. 25 రాష్ర్టాల్లోని 300 మందికిపైగా వర్తక నేతలు, 550 వర్తక సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత సీఏఐటీ…
వస్తువుల విభాగంలో నగలు, విలువైన లోహాల కొనుగోళ్లు రూ.1.2 లక్షల కోట్లకు చేరవచ్చని తెలిపింది. దుస్తులు, గార్మెంట్ల విక్రయాలు రూ.90,000 కోట్లుగా ఉంటాయని అంచనా వేసింది. బహుమతులు, పెండ్లి సామగ్రి; నిత్యావసర సరుకులు, ఆహార సరఫరాల విభాగాలు ఒక్కొక్కటి రూ.37,500 కోట్ల చొప్పున వ్యాపారం జరగవచ్చని పేర్కొన్నది. ఎలక్ట్రానిక్స్, డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, ఫర్నిచర్, గృహోపకరణాల విభాగాలు ఒక్కొక్కటి రూ.30,000 కోట్ల చొప్పున తోడ్పడవచ్చని తెలిపింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)