Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
69 ఏళ్ల వయసులో అదిరిపోయే సాహసం.. ఒంటికి నిప్పంటించుకుని.. 60 అడుగుల ఎత్తు నుంచి దూకిన వృద్ధుడు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
69-year-old Ramprasad Tiwari from Bulandshahr district, Uttar Pradesh, performed a fire stunt by setting his body on fire and jumping from a 60-foot height during a Ramlila event, which went viral on social media.
Police stated that all safety norms were followed during the event.
While the stunt is praised as a message of courage and perseverance, it is also noted as highly dangerous and should not be attempted without proper training and safety measures.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తున్నారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 69 ఏళ్ల రామ్‌ప్రసాద్ తివారీ. వృద్ధాప్యంలో సాధారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఆయన ప్రదర్శించిన సాహస విన్యాసం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా ఖుర్జాలో జరిగిన రామ్‌లీలా కార్యక్రమంలో తివారీ ఒళ్లు గగుర్పొడిచే ఫైర్ స్టంట్ చేశారు. తన ఒంటికి నిప్పంటించుకుని, సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. ఈ సాహస విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తివారీ ప్రదర్శించిన ఈ విన్యాసం చూస్తుంటే ఆయన ధైర్యం, సాహసంపై చూసేవారిని ఆశ్చర్య పర్చింది. 69 ఏళ్ల వయసులోనూ ఇంతటి సాహసం చేయడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విన్యాసం వెనుక దశాబ్దాల అనుభవం, సాధన, సంప్రదాయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆచారం దాదాపు 70 ఏళ్లుగా కొనసాగుతోందని, కార్యక్రమంలో నిర్దేశించిన భద్రతా ప్రమాణాలన్నీ పాటించామని బులంద్‌షహర్ పోలీసులు చెబుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)