Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆరా కోసం ఆరాటం
By Eenadu2 min read at Eenadu
In brief
ఒక రెండేళ్ల బాలుడు ఇచ్చిన కాన్ఫిడెంట్ పోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అతన్ని 'ఆరా కిడ్' అని పిలిచారు.
ఆరా అంటే ఒక వ్యక్తి నుంచి ఎదుటివారికి కనిపించే ఆకర్షణ, ప్రభావం, యాటిట్యూడ్ అని, దాన్ని పెంచుకోవడాన్ని ఆరా ఫార్మింగ్ అని ఈ వ్యాసం వివరిస్తుంది.
అయితే ప్రతిదాన్నీ ప్రదర్శనలా మార్చుకోవాల్సిన అవసరం లేదని, సహజమైన ఆరా ఉండటమే ముఖ్యమని ఈ వ్యాసం అభిప్రాయపడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కొత్త బండి ముందు నిలబడి.. కళ్లకు అద్దాలు, జేబుల్లో చేతులు పెట్టుకుని ఓ రెండేళ్ల బుడతడు ఇచ్చిన పోజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన కాన్ఫిడెంట్ లుక్ చూసి ‘ఆరా కిడ్’ అని పేరుపెట్టేశారు నెటిజన్లు. అయితే ఆ చిన్నారి ఆ వీడియో కోసం ప్రత్యేకంగా ఏమీ ప్లాన్ చేయలేదు. తన స్టైల్, ఎక్స్ప్రెషన్స్ సహజంగా అందరినీ ఆకట్టుకున్నాయి. అలాంటి ప్రత్యేకమైన ఆకర్షణనే ‘ఆరా’ అంటున్నారు. ఆ ఆరా మనకూ ఉండాలని యువత ప్రయత్నిస్తోంది ఇప్పుడు. దీన్నే ‘ఆరా ఫార్మింగ్’ అంటున్నారు.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ పదం బాగా వినిపిస్తోంది. ఆరా అంటే ఒక వ్యక్తి నుంచి ఎదుటివారికి కనిపించే ఆకర్షణ, ప్రభావం, యాటిట్యూడ్. ఫార్మింగ్ అంటే దాన్ని పెంచుకోవడం. ఒక్కమాటలో చెప్పాలంటే కూల్‌గా, కాన్ఫిడెంట్‌గా, ప్రత్యేకంగా కనిపించేలా కావాలనే ప్రయత్నించడం. ఉదాహరణకు.. ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్‌గా నడుస్తూ వీడియో తీయించుకోవడం, కాఫీ షాప్‌లో కూర్చుని సినిమాటిక్ ఫొటో దిగడం, స్టోరీ పెట్టుకోవడం కోసం సరైన పాట, యాంగిల్ ఎంచుకోవడం.. ఇవన్నీ ఆరా ఫార్మింగ్‌లో భాగమే. ప్రతి సందర్భంలోనూ మనమే మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు కనిపించాలనుకోవడం ఇందులోని మరో కోణం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)