Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో వైభవంగా కార్తిక దీపోత్సవం
By Eenadu2 min read at Eenadu
In brief
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో నవంబర్ 19 నుంచి 22 వరకు కార్తిక దీపోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ నాలుగు రోజుల వేడుకల్లో తమిళనాడు నుంచి వందలాది మంది భక్తులు పాల్గొని సంప్రదాయ ప్రమిదలు వెలిగించారు.
గురుదేవ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ పండుగ వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరించారు మరియు ఆధ్యాత్మిక సాధన మన నిత్యజీవితాన్ని ఒక వేడుకగా మార్చగలదని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బెంగళూరు: ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో కార్తిక దీపోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 21వేల సంప్రదాయ ప్రమిదలతో ఆశ్రమమంతా దీపకాంతులతో వెలిగిపోయింది. నవంబర్ 19 నుంచి 22 వరకు నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో తమిళనాడు నుంచి వందలాది మంది భక్తులు పాల్గొని భక్తి, విశ్వాసం, సాంస్కృతిక సంప్రదాయాల అద్భుత సమ్మేళనాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి గురుదేవ్ కార్తిక దీపోత్సవంలో దీపాలు వెలిగించడం వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరించారు. ‘ఈ పండుగ కేవలం బయట ఉన్న చీకటిని తొలగించడం మాత్రమే కాదు. మన మనస్సుల్లో ఉన్న అంధకారాన్ని కూడా తరిమికొడుతుంది. జ్ఞానజ్యోతిని వెలిగించి, అజ్ఞానాన్ని తొలగించి, జీవితంలో మరింత ఆనందాన్ని నింపేందుకు ఈ పండుగ ఒక గొప్ప అవకాశం’ అన్నారు. భారతదేశపు విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. సంగీతం, నృత్యం, కళలు, ఆధ్యాత్మికత మన సంస్కృతిలో విడదీయలేని భాగాలని గురుదేవ్ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సాధన మన నిత్యజీవితాన్ని సైతం ఒక వేడుకగా మార్చగలదని వివరించిన ఆయన.. ‘మనం ఆధ్యాత్మిక సాధనలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)