Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్టీసీ బస్సుల్లో ఐ-అలర్ట్ పరికరం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఇంధనం పొదుపు మరియు ప్రమాదాల నివారణ కోసం ఐ-అలెర్ట్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
ఆర్టీసీ ఉన్నతాధికారుల ప్రకారం, ఈ పరికరం డ్రైవింగ్ వేగం, బ్రేక్ వాడకం మరియు ఎకానమీ గేర్ వినియోగం వంటి అంశాలను పర్యవేక్షిస్తుంది.
తెలంగాణ ఆర్టీసీలో 1,500 అశోక్ లేలాండ్ బస్సుల్లో ఈ పరికరాలను అమర్చడం ద్వారా రోజుకు 6,603 లీటర్ల ఆయిల్ ఆదా అవుతున్నదని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఇంధనం పొదుపుతోపాటు ప్రమాదాల నివారణకు సురక్షితమైన డ్రైవింగ్ కోసం ఐ-అలెర్ట్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఐ-అలర్ట్ ద్వారా నిర్దేశించిన గ్రీన్ బాండ్ ఆర్పీఎం పరిధిలో డ్రైవింగ్ చేయడం, ఎకానమీ గేర్లను సమర్థంగా వాడటం, ఇంజిన్ అనవసర వినియోగాన్ని తగ్గించినట్టు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అతివేగానికి(ఓవర్ స్పీడ్) కళ్లెం వేయడం, నిర్లక్ష్యంగా బ్రేక్‌ల వాడకం, ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులను అలవర్చుకోవడం వంటి అంశాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తున్నదని అంటున్నారు.
ఈ ఐ-అలర్ట్ ఒక్కో డ్రైవర్ పనితీరును పరిశీలిస్తూ, క్రమం తప్పకుండా సమాచారం ఇస్తుంది. విధి నిర్వహణ అనంతరం డ్రైవర్ నైపుణ్యాన్ని అంచనావేసి పనితీరుకు గ్రేడింగ్స్ కూడా ఇస్తున్నదని, దీంతో డ్రైవర్లకు తాము హెచ్చరికలు జారీ చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఆర్టీసీలో 1,500 అశోక్ లేలాండ్ బస్సుల్లో ఐ-అలెర్ట్ పరికరాలను అమర్చడం ద్వారా రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల ఆయిల్ ఆదా అవుతున్నది. ఈ సమర్థ టెక్నాలజీ వినియోగం ద్వారా సంస్థ ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన హెచ్ఎస్డీ (హై-స్పీడ్ డీజిల్) ఆయిల్‌ను ఆదా చేసింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)