Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్థిక మార్కెట్లపై ఆర్బీఐ నజర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Reserve Bank of India (RBI) established the Technical Consultative Committee on Financial Markets (TCCFM) on Wednesday to focus on key policy and operational issues in financial markets.
Deputy Governor Rohit Jain will chair the committee, which aims to facilitate regular consultations with market participants and address emerging operational and regulatory challenges.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబయి, నవంబర్ 4: నగదు మార్కెట్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు తదితర ఆర్థిక మార్కెట్లలో కీలక విధాన, కార్యాచరణ అంశాలపై దృష్టిసారించే ఆర్థిక విపణుల సాంకేతిక సంప్రదింపుల కమిటీని (టీసీసీఎఫ్ఎమ్) ఆర్బీఐ బుధవారం ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ (ఎఫ్ఎమ్ఆర్డీ) బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ గవర్నర్ రోహిత్ జైన్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తారు. నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, విదేశీ మారక మార్కెట్లు, వాటికి సంబంధించిన ఒప్పందాల మార్కెట్లు, మౌలిక సదుపాయాల విధాన, కార్యాచరణ అంశాలపై మార్కెట్ భాగస్వాములు, ఇతర వర్గాలతో ఆర్బీఐ క్రమబద్ధంగా సంప్రదింపులు జరిపేందుకు ఈ కమిటీ వేదికగా…
ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్, రిపోర్టింగ్తోపాటు ఇతర మార్కెట్ మౌలిక సదుపాయాలు, వాటికి సంబంధించిన నియంత్రణ, కార్యాచరణ విధానాల అంశాలను టీసీసీఎఫ్ఎమ్ పరిశీలిస్తుంది. ఆర్బీఐ చర్యల అమలు, మార్కెట్లలో అనుకోకుండా ఏర్పడే ఆటంకాల గుర్తింపుతోపాటు ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేసే కొత్త విధాన, కార్యాచరణ సమస్యలను కూడా కమిటీ పరిశీలిస్తుంది. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు, ఆర్థిక రంగ ఆవిష్కరణలు, భారత ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపే కొత్త ముప్పులపైనా దృష్టిసారిస్తుంది. కాగా, కమిటీ సమావేశాలను ప్రతి త్రైమాసికంలో కనీసం ఒకసారి నిర్వహిస్తామని ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ కమిటీలో సెబీ పూర్తికాల మాజీ సభ్యుడు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)