Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Agricultural University | అగ్రి వర్సిటీలో రెండు కొత్త డిగ్రీ కోర్సులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో రెండు కొత్త డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టింది.
అకడమిక్ కౌన్సిల్ సమావేశం సోమవారం రాజేంద్రనగర్లోని యూనివర్సిటీ ఆడిటోరియం కమిటీ హాల్లో వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన జరిగింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్) మరియు బీఎస్సీ(ఫుడ్ సైన్స్, డైటెటిక్స్) కోర్సులను ప్రారంభించాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Agricultural University | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో రెండు కొత్త డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టింది. అగ్రివర్సిటీ 119వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం సోమవారం రాజేంద్రనగర్లోని యూనివర్సిటీ ఆడిటోరియం కమిటీ హాల్లో వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అధ్యక్షతన జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రెండు కొత్త డిగ్రీ కోర్సులను ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది.
హైదరాబాద్ ఐఐటీ, బిట్స్ సహకారంతో నాలుగేండ్ల బీటెక్(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్) కోర్సుని ప్రారంభించాలని అకడమిక్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. అలాగే బీఎస్సీ(ఫుడ్ సైన్స్, డైటెటిక్స్)ను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయశాఖ సహకారంతో రైతుల్లో అవగాహన పెంపొందించి, భరోసా కల్పించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులతో రాష్ట్రవ్యాప్తంగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైతు భరోసా యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)