Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు: అమరావతి వాతావరణ కేంద్రం
By Eenadu2 min read at Eenadu
In brief
అమరావతి వాతావరణ కేంద్రం మరియు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం, నైరుతి బంగాళాఖాతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
కార్తిక పౌర్ణమి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది, తిరుమల శ్రీవారి ఆలయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
అమరావతి: నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో తూర్పు గాలుల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, రాష్ర్ట విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని హెచ్చరించింది. ఇవాళ కొండాపురంలో 39.2మి.మీ, కొత్తపట్నంలో 34.4మి.మీ, కావలిలో 34.2, మారెళ్లలో 33.5, త్రిపురాంతకంలో 27.9, నెల్లూరులో 27.5, ములుకుదురులో 26, నెల్లూరు రూరల్లో 25.7మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)