Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అప్పాపూర్లోని ఆశ్రమ పాఠశాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం
By Eenadu1 min read at Eenadu
In brief
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సందర్శించారు.
ఆయన బౌరాపూర్, అప్పాపూర్, చెంచుపెంటలను పరిశీలించి బౌరాపూర్లోని భ్రమరాంబ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు.
అక్కడ ఆదివాసీలతో మాట్లాడి వారి జీవనోపాదులు, జీవన పరిస్థితులు, తాగునీరు, వైద్యం అందడంపైనా అడిగి తెలుసుకున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమ్రాబాద్: నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం సందర్శించారు. రెండు రోజుల నల్లమల పర్యటనలో భాగంగా ఆదివారం అటవీ ప్రాంతంలోని బౌరాపూర్, అప్పాపూర్, చెంచుపెంటలను పరిశీలించారు. బౌరాపూర్లోని పురాతన భ్రమరాంబ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ఆదివాసీలతో మాట్లాడి వారి జీవనోపాదులు, జీవన పరిస్థితులు, తాగునీరు, వైద్యం అందడంపైనా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పాపూర్లోని ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్నభోజనం మెనూను పరిశీలించి తగు సూచనలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)