Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- Minister Ponnuganti Srinivas Reddy distributed house titles to eligible beneficiaries under the Indiramma housing scheme at the Khammam district Kusumanchi MLA camp office. He accused the previous BRS government of prioritizing the Kaleshwaram project for commissions over providing housing, and stated that the current government is implementing the housing scheme despite financial constraints.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కూసుమంచి, వెలుగు: సార్వత్రిక ఎన్నికల నాటికి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు మంత్రి ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం నిర్మించారని ఆరోపించారు.
హైదరాబాద్లోని 23 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోయినా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, రెండు లక్షల ఇళ్లకు సంబంధించిన ఫైనల్ బిల్లులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని, ఆ అప్పులను చెల్లిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.