Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అర్నబ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రాంసుందర్
By Eenadu1 min read at Eenadu
In brief
Collector S. Ramsundar directed all government departments in the district to take preliminary precautions against Cyclone Arnab. He warned that the cyclonic storm could make landfall near Kakinada, bringing heavy rains and strong winds to North Andhra Pradesh.
The collector also ordered officials to ensure uninterrupted power and water supply and to prevent water contamination and disease outbreaks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం రూరల్: అర్నబ్ తుపాను పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖలన్ని క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎట్టిపరిస్థితిలోనూ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకూడదని స్పష్టం చేశారు. తుపాను ముందు జాగ్రత్త చర్యలపై ఆయన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్రంగా మారి కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని, దీని ప్రభావంవతో ఉత్తరాంధ్ర అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. కేవలం…
విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, భారీ గాలుల కారణంగా అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటికి ఎక్కడా ఇబ్బంది లేకుండా, ట్యాంకర్లను సైతం సిద్దం చేయాలన్నారు. వర్షాల అనంతరం నీరు కలుషితం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డయేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు సుధాసాగర్, సుధారాణి, రామ్మోహనరావు, జిల్లా విపత్తు నిర్వహణాధికారి డాక్టర్ అంబరీష్, అధికారులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


