Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అవాడా అత్యాధునిక సోలార్ మాడ్యూల్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the solar power company Avada launched its new G12 N-Topcon 720Wp DCR solar module in Hyderabad.
Ajay Mishra, retired Special Secretary of the Energy Department, inaugurated the product at an event organized by SAS Energy, Sri Associates, and Moksha Solar.
Company representatives highlighted the module's advanced technology and stated that such innovations will boost energy production and support environmental protection and national energy self-sufficiency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రముఖ సౌర విద్యుత్తు సంస్థ ‘అవాడా’ మార్కెట్లోకి సరికొత్త జీ12 ఎన్ టాప్ కాన్ 720 డబ్లూపీ డీసీఆర్ సోలార్ మాడ్యూల్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిషరించింది. శనివారం హైదరాబాద్‌లో ఎస్ఏఎస్ ఎనర్జీ , శ్రీ అసోసియేట్స్ , మోక్ష సోలార్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇంధన శాఖ రిటైర్డ్ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మాడ్యూల్‌ను మారెట్లోకి విడుదల చేశారు.
ఈ సదస్సులో టీజీఎస్ పీడీసీఎల్ డైరెక్టర్ సీహెచ్ చక్రపాణి, టీజీరెడ్కో జనరల్ మేనేజర్ సత్య వరప్రసాద్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు పంకజ్ ఉపాధ్యాయ్, అతుల్ మెష్రామ్, వేణుగోపాల్ మైలు నూతన టాప్ కాన్ సాంకేతికత విశిష్టతలను, దాని అధిక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని వివరించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. సౌర విద్యుత్తు విభాగంలో ఇటువంటి నూతన ఆవిషరణలు విద్యుత్తు ఉత్పాదకతను భారీగా పెంచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, దేశ ఇంధన స్వయం సమృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయని స్పష్టం చేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)