Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bajaj Pulsar 180: బజాజ్ పల్సర్ 180కి మళ్లీ బ్రేక్.. వెబ్సైట్ నుంచి ఔట్
By Eenadu1 min read at Eenadu
In brief
బజాజ్ ఆటో పల్సర్ 180ని నాలుగేళ్ల విరామం తర్వాత లాంచ్ చేసిన ఆరు నెలలకే వెబ్సైట్ నుంచి తొలగించింది.
ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో గతంలో కూడా దీన్ని నిలిపివేసింది, ఇప్పుడు మళ్లీ వెబ్సైట్ లిస్టులోంచి తీసేసింది.
బజాజ్ ఆటో అధికారికంగా కారణం వెల్లడించలేదు, ప్రస్తుతం వెబ్సైట్లో పల్సర్ 125, 150, 220ఎఫ్ మాత్రమే కనిపిస్తున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Bajaj Pulsar 180 | ఇంటర్నెట్‌డెస్క్: బజాజ్ ఆటో పల్సర్ 180ని (Bajaj Pulsar 180) మరోసారి నిలిపివేసింది. నాలుగేళ్ల విరామం తర్వాత లాంచ్ చేసిన ఆరు నెలలకే కంపెనీ వెబ్సైట్ నుంచి తొలగించింది. ఎందుకు తొలగించిందీ మాత్రం బజాజ్ ఆటో అధికారికంగా వెల్లడించలేదు. 180సీసీ సెగ్మెంట్లో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180కి పోటీగా.. బజాజ్ ఆటో పల్సర్ 180ని తీసుకొచ్చింది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో 2022లో తొలిసారి దాన్ని నిలిపివేసింది. 2026 ఏప్రిల్‌లో పల్సర్ 180ని మళ్లీ లాంచ్ చేసింది. దాన్ని తాజాగా వెబ్సైట్ లిస్టులోంచి తొలగించింది. ప్రస్తుతం పల్సర్ 125, పల్సర్ 150, 220ఎఫ్‌ను మాత్రమే…
విక్రయాల పరంగా అంచనాలను అందుకోని సందర్భంలో బజాజ్ తన మోడళ్లను నిలిపివేయడం కొత్తేం కాదు. పల్సర్ 180నే కాదు.. ఈ ఏడాది జూన్‌లో ఎన్125 మోడల్‌ను కూడా బజాజ్ ఆటో నిలిపివేసింది. పల్సర్ 125, పల్సర్ 150కి ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉంది. 220కీ సపరేట్ ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఎటొచ్చి 180కి ఆదరణ అంతంత మాత్రమనే చెప్పాలి. దీంతో తీసుకొచ్చిన ఆరు నెలలకే ఈ బైక్‌ను నిలిపివేయడం గమనార్హం. భవిష్యత్‌లో మళ్లీ తీసుకొచ్చే అవకాశం కూడా లేనట్లు తెలుస్తోంది. పల్సర్ క్లాసిక్‌లో 125, 150, 220లకు మాత్రమే నెక్ట్స్ జనరేషన్లు వచ్చే అవకాశం ఉంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)