Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bangladesh: బంగ్లాదేశ్ జైళ్లలోని విదేశీయుల్లో సగానికి పైగా భారతీయులే
By Eenadu||2 min read at Eenadu
In brief
Local media reports indicate that over half of the foreign prisoners in Bangladeshi jails are Indian nationals.
An Indian High Commission official stated that the process of verifying their citizenship is causing delays in their repatriation.
The official also mentioned that permission has been sought to meet with the detained prisoners.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) జైళ్లలోని విదేశీ ఖైదీలలో సగానికి పైగా భారతీయులే ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, బంగారం స్మగ్లింగ్ వంటి వివిధ నేరాలకు సంబంధించి 15 దేశాలకు చెందిన కనీసం 407 మంది విదేశీయులు ఇక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. వారిలో 238 భారతీయులు (Indian Prisoners) కాగా.. 168 మంది శిక్షాకాలం ఇప్పటికే పూర్తయ్యింది. వారిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు ఇంకా పూర్తి కాకపోవడంతో నిర్బంధంలోనే ఉన్నారు. మిగిలిన వారిలో మయన్మార్, నైజీరియా, పాకిస్థాన్, మలేషియాలకు చెందిన వారు ఉన్నారు.
జైలు శిక్ష పూర్తి చేసుకున్న భారతీయ ఖైదీల జాబితాలను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమకు పంపిందని భారత హైకమిషన్ (High Commission of India) అధికారి తెలిపారు. వారు భారతీయులేనా కాదా అనే విషయాన్ని నిర్ధరించుకోవడంలో పలు సమస్యలు ఉండడంతో విడుదలలో జాప్యం చోటుచేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆ ఖైదీలను కలిసి, మాట్లాడేందుకు అక్కడి అధికారుల అనుమతి కోరామన్నారు. బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని.. ఖైదీల జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఇదీ చదవండి: మీ సైనికుల మృతదేహాలకు మేమే అంత్యక్రియలు చేశాం..: ఐరాసలో పాక్కు భారత్ చురకలు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)