Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
బెంగళూరులో మరో ‘సర్’ వివాదం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బెంగళూరులో తుది ఓటర్ల జాబితాలోని కొత్తగా చేరిన 1,13,059 మంది ఓటర్ల దరఖాస్తుల వివరాలు అందుబాటులో లేవని ‘ది హిందూ’ పరిశీలనలో వెల్లడైంది.
మొత్తం కొత్తగా నమోదైన 2,55,926 మంది ఓటర్లలో దాదాపు 44 శాతం దరఖాస్తులను అధికారిక రికార్డులతో సరిపోల్చలేకపోయారు.
ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించి, ఫామ్-6కు సంబంధించిన అన్ని దరఖాస్తులూ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు, నవంబర్ 17: కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియపై మరో వివాదం తెరపైకి వచ్చింది. బెంగళూరులో తుది ఓటర్ల జాబితాలో కొత్తగా చేరిన 1,13,059 మంది ఓటర్లకు సంబంధించిన దరఖాస్తుల వివరాలు అందుబాటులో లేవని ‘ది హిందూ’ పరిశీలనలో వెల్లడైంది. మొత్తం కొత్తగా నమోదైన 2,55,926 మంది ఓటర్లలో దాదాపు 44 శాతం మందికి సంబంధించిన దరఖాస్తులను అధికారిక రికార్డులతో సరిపోల్చలేకపోయారు. అంటే కొత్తగా చేరిన ప్రతి ఇద్దరిలో దాదాపు ఒకరి దరఖాస్తు వివరాలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాలను పరిశీలించినప్పుడు ఈ వ్యత్యాసం బయటపడింది.
కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫామ్-6, ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారి పోలింగ్ కేంద్రం లేదా నియోజకవర్గ మార్పులకు ఉపయోగించే ఫామ్-8 దరఖాస్తుల వివరాలతో తుది జాబితాలోని పేర్లను సరిపోల్చగా 1.13 లక్షల మంది వివరాలు లభించలేదుఅన్ని దరఖాస్తులూ ఉన్నాయి: ఈసీ ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించింది. ఫామ్-6కు సంబంధించిన అన్ని దరఖాస్తులూ తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగిన క్లెయిమ్లు, అభ్యంతరాల గడువు వెలుపల దాఖలైన కొన్ని దరఖాస్తులు ఫామ్-9 నివేదికల్లో కనిపించకపోవచ్చని వివరించింది. ఫామ్-9 నివేదికలను క్లెయిమ్లు, అభ్యంతరాల గడువు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)