Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Bihar: గంగా నదిలో పడవ బోల్తా.. 13 మంది మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
A boat capsized in the Ganges River in Bihar's Vaishali district, resulting in the deaths of 13 people, many of whom were children.
Prime Minister Narendra Modi and local officials expressed their condolences and announced financial assistance for the victims' families.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వైశాలి (బిహార్): బిహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా పరిధిలోని గంగా నదిలో మంగళవారం రాత్రి పడవ బోల్తా పడింది. 15 నుంచి 20 మందితో విందు కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వైశాలి జిల్లా ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
పడవ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘పడవ బోల్తా పడిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు స్థానిక యంత్రాంగం సహాయం అందిస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు మోదీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ సైతం ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున సాయం ప్రకటించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)