Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Boy Swallowed Magnet: అయస్కాంతాన్ని మింగిన బాలుడు.. మరో అయస్కాంతంతో బయటకు తీసి
By Eenadu1 min read at Eenadu
In brief
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలుడు పొరపాటున చిన్న అయస్కాంతాన్ని మింగగా, కోల్కతా వైద్య కళాశాల-ఆసుపత్రిలోని వైద్యులు మరో అయస్కాంతాన్ని ఉపయోగించి దానిని శ్వాసనాళం నుండి విజయవంతంగా బయటకు తీశారు.
ఈ వినూత్న ప్రక్రియను దేశంలోని ఏ ఆసుపత్రిలోనూ ఇంతకుముందు నిర్వహించలేదని సంబంధిత వైద్యులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ఆరేళ్ల పిల్లాడు పొరపాటున చిన్నపాటి అయస్కాంతాన్ని మింగేయగా.. వైద్యులు మరో అయస్కాంతాన్ని ఉపయోగించి దానిని బయటకు తీసి, అతడి ప్రాణాలు కాపాడారు. పశ్చిమ బెంగాల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఉత్తర 24 పరగణాల జిల్లా మహేశ్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడికి ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని కోల్కతా వైద్య కళాశాల- ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. చిన్నపాటి అయస్కాంతాన్ని మింగినట్లు తేలింది. దానిని బయటకు తీసేందుకు తొలుత చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
దీంతో వైద్య బృందం వినూత్న పరిష్కార మార్గంతో ముందుకొచ్చింది. ఆ అయస్కాంతాన్ని బయటకు తీసేందుకు మరో అయస్కాంతాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. దీని కోసం ఓ టెక్నీషియన్ ప్రత్యేకంగా చిన్న అయస్కాంతాన్ని తయారు చేశారు. దానిని వైద్య పరికరానికి అమర్చి.. శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన ఆ వస్తువును విజయవంతంగా బయటకు తీశారు. ఆహారం తీసుకుంటున్న సమయంలో బాలుడు పొరపాటున దాన్ని మింగినట్లు సమాచారం. తమకు తెలిసి దేశంలోని ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి ప్రక్రియ నిర్వహించలేదని సంబంధిత వైద్యులు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)