Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Chandrababu: ‘అక్వాన్’ తుపానుపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
By Eenadu1 min read at Eenadu
In brief
సీఎం చంద్రబాబు ‘అక్వాన్’ తుపానుపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారుల నుంచి గమన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తుపాను ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని, హెచ్చరికలు పంపాలని ఆయన ఆదేశించారు.
విపత్తులు వచ్చాయని భయపడాల్సిన పనిలేదని చెబుతూ, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ‘అక్వాన్’ తుపాను (Cyclone Akvan)పై సీఎం చంద్రబాబు (Chandrababu) టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను గమనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను గంటకు 3.కి.మీ వేగంతో కదులుతోందని.. ఈ సాయంత్రానికి తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. విపత్తులు వచ్చాయని భయపడాల్సిన పనిలేదని.. వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ హెచ్చరికలు పంపాలన్నారు. తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా కల్పించాలన్నారు.
‘‘ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుపాను తాకుతోంది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం పంపాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా వెంటనే క్లియర్ చేయాలి. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. తుపానుతో కురిసే భారీ వర్షాలకు చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని సీఎం దిశానిర్దేశం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)