Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Cyclone Arnab: అర్నబ్ తుపాను.. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
By Eenadu1 min read at Eenadu
In brief
The Cyclone Warning Centre Director stated that a depression in the Bay of Bengal is likely to intensify into a severe cyclonic storm named Cyclone Arnab by Tuesday morning, making landfall between Bapatla and Visakhapatnam.
Consequently, the Andhra Pradesh weather department has issued red, orange, and yellow alerts across multiple districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం సోమవారం తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశముందని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి తెలిపారు. ఈనెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా, 28 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది అదే రోజు మధ్యాహ్నానికి బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 140 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘అర్నబ్’ (Cyclone Arnab) పేరు పెట్టిన విషయం తెలిసిందే.
తుపాను దృష్ట్యా ఈ నెల 27న ఏపీలోని కాకినాడ, కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కడప, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. 28వ తేదీన కూడా పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


