Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కావేరి జలాల వివాదంపై తమిళనాడును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
తమ వద్ద తాగడానికి సరిపడా నీళ్లు లేవని, అందువల్ల నీటిని విడుదల చేయలేమని ఆయన స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తమిళనాడు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేయడంతో పాటు, కావేరి, మేకెదాటు ప్రాజెక్టులపై కాంగ్రెస్ హైకమాండ్ తో మాట్లాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
DK Shivakumar | కావేరి జలాల( kavery )వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమిళనాడును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక నుంచి 11 టీఎంసీల కావేరి జలాలను విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ విక్రమ్ నాథ్, అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం పిటిషన్లను కొట్టివేసింది.
ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ..తమ వద్ద నీళ్లు ఉంటే కచ్చితంగా తమిళనాడుకు ఇచ్చేవారమన్నారు. కానీ ప్రస్తుతం తమ రాష్ట్రంలోనే తాగడానికి కూడా సరిపడా నీళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. మా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయని, ఈ ఏడాది కావేరి నదికి సంప్రదాయంగా సమర్పించే ‘బాగిన’ (పూజ) కూడా తాను చేయలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కావేరి, మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు కాంగ్రెస్ నాయకుల ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండ్‌తో మాట్లాడుతానని పేర్కొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)