Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
He had been receiving treatment for an illness. A five-time MLA and three-time MP, he served as a minister in the cabinets of Y.S.
Rajasekhara Reddy and K. Rosaiah, and was a member of the Legislative Council from the Telugu Desam Party until 2023.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాఖపట్నం: ఏపీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. 1948 ఆగస్ట్ 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు వైఎస్సార్, రోశయ్య కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ మంత్రివర్గంలో అటవీశాఖ మంత్రిగా, రోశయ్య కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా శత్రుచర్ల పనిచేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా గెలిచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారు.
1978లో శత్రుచర్ల విజయరామరాజు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీలో చేరిన ఆయన 2017లో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 వరకూ ఎమ్మెల్సీగా కొనసాగారు. ఉత్తరాంధ్ర నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ రాజకీయ నాయకుల్లో శత్రుచర్ల విజయరామరాజు ఒకరు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)