Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీ తొలి విడత పంచాయతీ ఫలితాలు: కూటమిదే పైచేయి.. కొన్ని కంచుకోటల్లో షాక్ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి, ఇందులో అధికార ఎన్డీయే కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీనిచ్చినప్పటికీ, మొత్తం మీద కూటమి ఆధిపత్యం కనిపించింది.
ఈ ఫలితాలపై జగన్ స్పందిస్తూ పోలీసులు, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు, అయితే కూటమి వర్గాలు ప్రజల మద్దతు తమకే ఉందని హర్షం వ్యక్తం చేశాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 15 days across 2 events →
ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా సాగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార ఎన్డీయే కూటమి బలపరిచిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. పార్టీ రహితంగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో పల్లె ఓటర్లు కూటమి వైపే మొగ్గు చూపారు. తొలి దశలో ఎన్నికలు నిర్వహించిన మొత్తం 3,949 పంచాయతీల్లో 760 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఫలితాల సరళి ప్రకారం కూటమి మద్దతుదారులు 2,539 స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. ఇందులో టీడీపీ మద్దతుదారులు 2,325, జనసేన 189, బీజేపీ 25 పంచాయతీలను దక్కించుకున్నాయి. మరోవైపు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు…
రాయలసీమలో తిరుపతి మినహా మిగిలిన జిల్లాల్లో కూటమి పట్టు నిరూపించుకుంది. వైసీపీ అధినేత జగన్ సొంతూరు బలపనూరులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలవడం విశేషం. ఈ ఎన్నికల ఫలితాలపై జగన్ స్పందిస్తూ… అధికార కూటమి పోలీసులు, యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించారు. కాగా, ప్రజలు తమ ప్రభుత్వ పనితీరుకే మద్దతు పలికారంటూ కూటమి వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు నవంబర్ 29న జరగనున్నాయి.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)