Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీ ఉద్యోగులకు అలర్ట్.. 12వ పీఆర్సీ మార్గదర్శకాలు విడుదల! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.
రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణకు మార్గదర్శకాలను విడుదల చేసింది.
దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 31 వరకు తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి ఏయే అంశాలను పరిశీలించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.ఈ విధివిధానాలపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలు, సూచనలు, అభ్యంతరాలను తెలియజేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది.ఈలోగా అందిన ప్రతిపాదనలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసిన తర్వాత పీఆర్సీ కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనుంది.దీంతో ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్లను కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కలగనుంది.
ఎవరెవరికి పీఆర్సీ వర్తించదు?12వ పీఆర్సీ పరిధికి సంబంధించి ప్రభుత్వం కొన్ని వర్గాలకు మినహాయింపు ఇచ్చింది.యూజీసీ (U+C), ఎన్సీటీఈ , బార్ కౌన్సిల్ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులకు ఈ వేతన సవరణ వర్తించదు.అలాగే జాతీయ న్యాయ వేతన సంఘం పరిధిలోకి వచ్చే న్యాయాధికారులు కూడా ఈ పీఆర్సీ పరిధిలోకి రారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఎయిడెడ్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది, శాశ్వత కంటింజెంట్ ఉద్యోగుల వేతనాలు, సర్వీస్ నిబంధనలను కమిషన్ పరిశీలించనుంది.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)