Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి.. నేటి నుంచే నామినేషన్లు - Visalaandhra
By Shanthi||2 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 21, 2026
The article reports that the state election commission in Andhra Pradesh has initiated the nomination process for MPTC and ZPTC elections starting today, with the final list of candidates to be published by this month 27th.
It details the schedule for nomination scrutiny, appeals, and the upcoming polling on the 3rd of next month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అవసరమైన చర్యలు చేపట్టింది.అభ్యర్థులు ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు కల్పించింది. ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది.
25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశంపరిశీలనలో తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అప్పీళ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుంది.ఎంపీటీసీ నామినేషన్లకు సంబంధించిన అప్పీళ్లను ఆర్డీవో పరిశీలించనుండగా.. జడ్పీటీసీ నామినేషన్లకు సంబంధించి కలెక్టర్ అప్పీలేట్ అథారిటీగా వ్యవహరించనున్నారు.ఈ నెల 26వ తేదీన అప్పీలేట్ అధికారులు అప్పీళ్లపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రచురించనున్నారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)