Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎవరు ఉంటారో..పోతారో!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Hyderabad Police Commissioner Mahesh Bhagwat recently took charge, leading to anxiety among police officers about potential transfers.
Senior officers and inspectors are reportedly worried about being moved to non-desirable posts, while some anticipate finally getting preferred postings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏడాదిలో మూడు పోలీసు స్టేషన్లు మారాను. ఎక్కడా పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు.. ఎప్పుడు ఎలాంటి ఆర్డర్ వస్తుందో తెలియక టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మళ్లీ మరోసారి బదిలీ తప్పదా అనుకుంటున్నారు నగరంలోని కీలక జోన్లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్. తాను పనిచేసిన చోట పూర్తిగా పట్టు సాధించే సమయానికే బదిలీ కావడంతో ఎక్కడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఇన్స్పెక్టర్ బాధ మాత్రమే కాదు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొందరు పోలీసు అధికారులు తమ సన్నిహితుల వద్ద చెబుతున్న మాటలివి. ప్రస్తుతం హైదరాబాద్ సీపీ మారారు. కొత్త…
కమిషనర్‌గా మహేశ్ భగవత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కమిషనరేట్‌లోని పోలీసు అధికారుల్లో గుబులు మొదలైంది. నగరానికి కొత్త పోలీసు బాసు రాగానే ప్రతీసారి జరిగే చర్చ ఇప్పుడు మళ్లీ జరుగుతోంది. ఫోకల్ పోస్టుల్లో ఉన్నవారంతా ఎప్పుడేం జరుగుతుందోనంటూ భయపడిపోతున్నారు. తమ గాడ్ఫాదర్ల ద్వారా కొత్త సీపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే వీరిలో చాలామందిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయని, వారిని అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయడం ఖాయమని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ముఖ్యంగా నగరంలోని జూబ్లీజోన్, ఖైరతాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్లలో పనిచేస్తున్న ఏసీపీలు, ఇన్స్పెక్టర్లలో కొందరు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)