Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) వైద్యులు 25 వారాల గర్భధారణ సమయంలో శిశువుకు వెన్నెముక సంబంధిత లోపాన్ని సరిచేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఓపెన్ ఫీటల్ సర్జరీ నిర్వహించారు.
ఈ శస్త్రచికిత్సలో తల్లి పొత్తికడుపు, గర్భాశయానికి కోత పెట్టి శిశువు ప్రభావితమైన వెన్నెముక భాగాన్ని సరిచేస్తారు.
ఎయిమ్స్ వైద్యుల ప్రకారం ఈ ప్రక్రియ అనంతరం తల్లి, శిశువు పరిస్థితి నిలకడగా ఉంది, అయితే ప్రసవం జరిగే వరకు నిరంతర పర్యవేక్షణ అవసరం.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Fetal Back Surgery | భారత వైద్యరంగంలో అరుదైన ఘనత నమోదైంది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు తల్లి గర్భంలోనే ఉన్న శిశువుకు వెన్నెముక సంబంధిత లోపాన్ని సరిచేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఓపెన్ ఫీటల్ సర్జరీ నిర్వహించారు. 25 వారాల గర్భధారణ సమయంలో నవంబర్ 12న ఈ శస్త్రచికిత్స చేపట్టారు. సుమారు ఆరు గంటలపాటు కొనసాగిన ఈ ప్రక్రియలో 30 మందికి పైగా వైద్యులు, నర్సులు వివిధ విభాగాల నుంచి పాల్గొన్నారు. శస్త్రచికిత్సకు ముందు ఐదు వారాలకు పైగా శిశువు ఆరోగ్య పరీక్షలు, స్కానింగ్, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్, శస్త్రచికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పుట్టిన తర్వాత చికిత్స చేసే బదులు…
శిశువుకు ఉన్న సమస్యను లంబోసాక్రల్ మైలోమెనింగోసీల్ అంటారు. ఇది స్పైనా బైఫిడా అనే పుట్టుకతో వచ్చే లోపంలో అత్యంత తీవ్రమైన రూపం. గర్భధారణ ప్రారంభ దశలో మెదడు, వెన్నెముకగా అభివృద్ధి చెందే నాడీ నాళం పూర్తిగా మూసుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. దీంతో వెన్నెముకలో రంధ్రం ఏర్పడి వెన్నెముక, దాని చుట్టూ ఉండే పొరలు బయటకు పొడుచుకొస్తాయి. దీనివల్ల నరాలు దెబ్బతిని కాళ్ల కదలికలు, మూత్ర విసర్జన, మల విసర్జన నియంత్రణపై ప్రభావం పడుతుంది. మెదడులో ద్రవం పేరుకుపోయే హైడ్రోసెఫాలస్ సమస్య కూడా వస్తుంది. సాధారణంగా శిశువు పుట్టిన తర్వాత ఈ లోపానికి శస్త్రచికిత్స చేస్తారు. అయితే గర్భంలోనే మరింత నష్టం జరగకుండా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)