Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Fire Accident: కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. గోదాముల్లో ఎగిసిపడ్డ మంటలు
By Eenadu1 min read at Eenadu
In brief
A major fire broke out in the asbestos colony in Kukatpally, Hyderabad, on Monday morning, causing massive damage to paper cup manufacturing and stock godowns.
Authorities suspect a short circuit caused the fire, though no casualties were reported.
Additional smaller fires caused by firecrackers occurred in Begum Bazaar, Jeedimetla, and other localities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: కూకట్పల్లిలోని ఆస్బెస్టాస్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ టీ కప్పులు, ప్లేట్స్ తయారీ కంపెనీలో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో నెయ్యి, కుర్కురే, హల్దీరామ్ స్టాక్ గోదాములకు మంటలు వ్యాపించి ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 4 ఫైర్ఇంజిన్లతో మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బేగంబజార్లోని ఓ భవనంలో బాణసంచా నిప్పులు పడి మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిపమాక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేశారు. జీడిమెట్లలోని ఓ స్క్రాప్దుకాణంలో బాణసంచా వల్ల మంటలు వ్యాపించాయి. ప్రమాదం ధాటికి షాపు మొత్తం అగ్నికి ఆహుతైంది. మైలార్దేవ్పల్లి ఓల్డ్ విలేజ్లోని డెకరేషన్ గోదాములో, సికింద్రాబాద్ బండిమెట్లోని డిస్ట్రిబ్యూటర్ డ్రగ్మార్ట్లో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదాల వల్ల రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)