Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Guinness World Record - Bali: బాలిలో 50 అడుగుల గణేశుడి విగ్రహం.. గిన్నిస్ రికార్డు
By Eenadu1 min read at Eenadu
In brief
బాలిలో 50 అడుగుల వినాయకుడి విగ్రహం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టించింది.
సింథటిక్ రట్టాన్తో నిర్మించిన ఈ విగ్రహం పీఠంతో కలిపి 72 అడుగుల ఎత్తుతో ప్లాస్టిక్ విగ్రహంగా రికార్డుకెక్కింది.
స్థానిక కళాకారులు రూపొందించిన ఈ విగ్రహాన్ని బాలిలోని జియాన్యార్ ప్రాంతంలో ఏర్పాటు చేశారని ఇండోనేసియా ఎంబసీ పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
బాలి: ఇండోనేసియాలోని (Indonesia) ప్రముఖ ద్వీపం బాలిలో ఏర్పాటు చేసిన 50 అడుగుల వినాయకుడి విగ్రహం గిన్నిస్ రికార్డు (Guinness World Records) సృష్టించింది. 15.315 మీటర్లు (సుమారు 50.2 అడుగులు) ఎత్తున్న ఈ విగ్రహం సింథటిక్ రట్టాన్ (పాలీఇథిలీన్ ప్లాస్టిక్)తో నిర్మించిన అతిపెద్ద కళాఖండంగా గుర్తింపు సొంతం చేసుకుంది.
ప్రపంచంలో దీని కంటే ఎత్తయిన విగ్రహాలు ఉన్నాయి. అయితే ఓ ఆధారం (పీఠం)పై ఏర్పాటు చేసిన ఎత్తయిన ప్లాస్టిక్ విగ్రహంగా ఇది రికార్డులకెక్కింది. పీఠాన్నీ పరిగణనలోకి తీసుకుంటే దీని మొత్తం ఎత్తు 72 అడుగులకు పైమాటే. ఈ విషయాలను ఇండోనేసియాలోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధ్రువీకరించింది. ఈ విగ్రహాన్ని బాలిలోని జియాన్యార్ ప్రాంతంలోని ఓ పర్యాటక కేంద్రం వద్ద ఏర్పాటు చేశారు. 126 మంది స్థానిక కళాకారులు రూపొందించారు. ఈ మేరకు దిల్లీలోని ఇండోనేసియా ఎంబసీ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)