Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Gujarat government's online magazine removed a controversial poem following a complaint from the Vishva Hindu Parishad (VHP).
The VHP alleged that the poem by Aziz Tankarvi, which appeared on page 389 of the annual issue, contained objectionable references to Lord Rama and Mirabai.
A VHP representative expressed satisfaction with the government's immediate action to remove the poem.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అహ్మదాబాద్: గుజరాత్(Gujarat) ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ప్రచురించే గుజరాత్ దీపోత్సవీ అంక్ ఆన్లైన్ మ్యాగ్జిన్ నుంచి ఓ వివాదాస్పద కవితను తొలగించారు. విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కవితను మార్చేశారు. శ్రీరాముడు, మీరాభాయ్ గురించి అభ్యంతరకర రీతిలో కవిత్వం ఉన్నట్లు వీహెచ్‌పీ ఆరోపించింది. కవి అజీజ్ తంకర్వీ ఆ కవితను రాశారు. ఆ వివాదాస్పద కవిత స్థానంలో ప్రకాశ్ జలాల్ అనే కవి రాసిన జోయే అనే కవితను ఆన్లైన్లో ప్రచురించారు. అజీజ్ రాసిన కవితను తక్షణమే తొలగించాలని అక్టోబర్ 23వ తేదీన సీఎం భూపేంద్ర పటేల్‌కు వీహెచ్‌పీ లేఖ రాసింది. రచయితతో పాటు ఆ…
అయితే తంకర్వీ కవితను రీప్లేస్ చేసినట్లు గుజరాత్ వీహెచ్‌పీ ప్రతినిధి హితేంద్రసిన్హా రాజ్‌పుత్ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కవితను తొలగించడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ ఏడాది ప్రచురితమైన వార్షిక మ్యాగ్జిన్‌కు చెందిన 389వ పేజీలో ఆ కవిత పబ్లిష్ అయినట్లు వీహెచ్‌పీ నేత అశ్వినీ పటేల్ తెలిపారు. శ్రీరాముడు, మీరాభాయ్ గురించి తప్పుగా రాసిన ఆ కవితను ప్రభుత్వ పబ్లికేషన్‌లో జోడించడం దారుణమని వీహెచ్‌పీ పేర్కొన్నది. 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగివస్తున్న శ్రీరాముడి గురించి ఆ కవితలో అనుచితంగా రాసినట్లు తెలిసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)



