Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Haryana: మిఠాయి వ్యాపారికి తేనెటీగల షాక్.. రూ.2 లక్షల నష్టం
By Eenadu1 min read at Eenadu
In brief
In Fatehabad, Haryana, a merchant experienced a massive honeybee attack on his Diwali sweets stall, resulting in three staff injuries and approximately Rs.
2 lakh in losses.
The incident caused customers to flee, forcing the vendor to give away some sweets for free.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: దీపావళి సందర్భంగా పెద్ద మొత్తంలో మిఠాయిల (Diwali sweets) అమ్మకానికి సిద్ధమైన ఓ వ్యాపారికి తేనెటీగలు షాక్ ఇచ్చాయి. స్వీట్లపైకి తమ దండుతో పోటెత్తాయి (Honeybee Attack). ఈ ఘటన హరియాణాలోని ఫతేబాద్‌లో చోటుచేసుకుంది. దీపావళి సందర్భంగా ఫతేబాద్‌లోని భివానీ ప్రాంతంలో ఓ వ్యాపారి పెద్ద మొత్తంలో మిఠాయిలు తయారు చేయించాడు. వాటిని విక్రయించడానికి బహిరంగ స్టాల్ ఏర్పాటు చేశాడు. మిఠాయిల వాసనకు దగ్గర్లోని తేనెటీగల దండు వాటి వద్దకు చేరింది.
తేనెటీగలు గుంపులుగా స్వీట్లపై వాలడంతో స్టాల్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అవి అక్కడి నుంచి పోకపోవడంతో వారు చేతులెత్తేశారు. వాటి దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది. తేనెటీగలు వాలడంతో ఆ మిఠాయిలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎవరూ ముందుకు రాలేదు. చివరకు వాటిలో కొన్నింటిని పలువురికి ఉచితంగా పంచి పెట్టాల్సి వచ్చిందని వ్యాపారి పేర్కొన్నారు. ఈ ఘటన వల్ల రూ.2లక్షల నష్టం వాటిల్లిందని వాపోయారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: ఉంటాడు నా రాజు.. ఆ వైపు!.. తోడు కోసం సొరంగం తవ్వుకుని వెళ్లిపోయిన ఆడపులి
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)