Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: బియ్యం అక్రమ నిల్వలపై అధికారుల మెరుపు దాడులు
By Eenadu1 min read at Eenadu
In brief
According to the article, officials in Hyderabad conducted raids on the second consecutive day to uncover illegal rice hoarding amid rising prices in Telangana.
Task Force head Shashidhar Raju led inspections in areas like Mangalhat and Malakpet, where authorities found violations including PDS rice recycling and GST evasion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలొస్తున్న నేపథ్యంలో అక్రమ నిల్వపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. వరసగా హైదరాబాద్లో రెండో రోజు కూడా పలు ప్రాంతాల్లో అక్రమ బియ్యం నిల్వలపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ విభాగం, మెట్రలాజికల్ విభాగం, జీఎస్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. టాస్క్ఫోర్స్ టీమ్ హెడ్ శశిధర్ రాజు నేతృత్వంలో మంగళహాట్, మలక్పేట, అమీర్పేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు సాగాయి.
కృష్ణా నగర్ కమలాపురి కాలనీలో నీలం రైస్ డిపోలో నిర్వహించిన సోదాల్లో విస్తుపోయే అక్రమాలు వెలుగు చూశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ బియ్యం నిల్వలను అధికారులు గుర్తించారు. ఊరు.. పేరూ లేని వివిధ బ్రాండ్ల పేరిట అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్, నాణ్యత లోపాలు, సన్న బియ్యం పేరిట అత్యాధునిక ప్యాకింగ్, ఆకట్టుకునే బ్రాండ్లు, తూకంలో తేడాలు, అధిక ధరలకు విక్రయం, జీఎస్టీ ఎగవేత వంటి అక్రమాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)