Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Hyderabad: హైదరాబాద్లో తాగునీటి వృథాపై జలమండలి కఠిన చర్యలు
By Eenadu||1 min read at Eenadu
In brief
The Hyderabad Jal Board has decided to take strict action against the wastage of drinking water, particularly from tanker trucks.
MD Ashok Reddy issued special guidelines and announced a fine of Rs 5,000 for tanker owners who waste water starting November 1, with repeat offenders facing registration cancellation.
The board also ordered officials to stop the use of leaky, uncovered tankers at filling stations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: నగరంలో తాగునీటి వృథాపై కఠిన చర్యలు చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. జలమండలి ట్యాంకర్ల ద్వారా జరిగే నీటి వృథాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎండీ అశోక్ రెడ్డి... నీటి వృథాను నివారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటి వృథాకు పాల్పడితే నవంబర్ 1 నుంచి సంబంధిత ట్యాంకర్ యజమానికి రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అదే ట్యాంకర్ రెండో సారి నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
నీటి లీకేజీలు, మూతలు లేని ట్యాంకర్లను ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద ఉపయోగించవద్దని అధికారులను ఎండీ ఆదేశించారు. ట్యాంకర్లపై మూతలు సరిగా లేకపోవడం వల్ల రవాణా సమయంలో నీరు రోడ్డుపై వృథాగా పోతున్నట్లు జలమండలి గుర్తించింది. రవాణా సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు అమలు చేయాలని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల జనరల్ మేనేజర్లను ఆదేశించారు. ట్యాంకర్లలో నీటిని నింపే ముందు లీకేజీలు, మూతల పరిస్థితిని పరిశీలించాలని, లోపాలను గుర్తిస్తే వాటిని సరిచేసే వరకు నీటిని నింపరాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)