Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
India-Pakistan: నిషేధించినా సరే.. పాక్‌లో భారత వస్తువులకు డిమాండ్..
By Eenadu2 min read at Eenadu
In brief
Despite a formal ban on direct trade, Indian goods worth ₹586 crores were imported into Pakistan via transit hubs like the UAE and Singapore in the July-September quarter of the current financial year.
This figure represents a 69% increase compared to the same period last year, according to a report by the Pakistani newspaper Dawn.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం , అనంతర పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్‌తో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకున్న భారత్.. దాయాదితో ప్రత్యక్ష వాణిజ్యాన్నీ (India-Pakistan Trade Ban) నిలిపివేసింది. దీంతో పాక్ కూడా భారత్ నుంచి దిగుమతులపై నిషేధం విధించింది. అయినప్పటికీ.. ఆ దేశ మార్కెట్లో మన వస్తువులకు గిరాకీ మాత్రం తగ్గలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో ఏకంగా రూ.586 కోట్ల విలువైన భారత ఉత్పత్తులు పాక్ (Pakistan)కు చేరడం గమనార్హం. యూఏఈ, సింగపూర్ లాంటి మూడో దేశం మీదుగా మన వస్తువులు (Indian Goods) దాయాది మార్కెట్లోకి వెళ్తున్నట్లు వాణిజ్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు.
2026-27 జులై-సెప్టెంబరు త్రైమాసికంలో పాక్ వాణిజ్య లోటుపై డాన్ పత్రిక కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. ఈ త్రైమాసికంలో 61.74 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.586 కోట్లు) విలువైన భారత ఉత్పత్తులను పాక్ దిగుమతి (Imports From India) చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఈ విలువ దాదాపు 69శాతం అధికం కావడం గమనార్హం. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పాక్‌కు భారత వస్తువుల దిగుమతుల విలువ 36.55 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.346కోట్లు) ఉంది. అయితే, ఇదే జులై-సెప్టెంబరు మధ్య పాక్ నుంచి భారత్‌కు ఎలాంటి ఎగుమతులు జరగలేదని సదరు కథనం వెల్లడించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)