Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jensen Huang: తెలివైన వ్యాపారి.. ప్రేమ సాగరంలో ‘మునిగి’.. జెన్సన్ హువాంగ్ ప్రయాణమిది..
By Eenadu4 min read at Eenadu
In brief
The article profiles Nvidia CEO Jensen Huang's journey, from his difficult childhood in Taiwan to founding the company, and his subsequent resignation in 2024 due to an extramarital affair with a suspected Chinese spy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: జెన్సన్ హువాంగ్.. మొన్నటి వరకు టెక్-ఏఐ ప్రపంచాన్ని శాసించిన పేరు ఇది. 33 ఏళ్ల కిందట ఓ డిన్నర్ టేబుల్‌పై ఆయనకు వచ్చిన ఆలోచన.. 4.5 లక్షల కోట్ల డాలర్ల కంపెనీకి పునాది వేసింది. కష్టాలనే సవాళ్లుగా మార్చుకుని ఆయన చేసిన ప్రయాణం.. చిప్ రంగంలో ఎన్విడియాను అగ్రగామిని చేసింది. అలాంటి వ్యక్తి నేడు వివాహేతర బంధం కారణంగా అనూహ్య రీతిలో ఆ కంపెనీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఎన్విడియా (Nvidia)తో మూడు దశాబ్దాల సుదీర్ఘ బంధాన్ని ముగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతటి ఎత్తుపల్లాలను చవిచూసిన జెన్సన్ (Jensen Huang) కెరీర్‌ను ఓసారి గుర్తుచేసుకుంటే..!
జెన్సన్ హువాంగ్ 1963లో తైవాన్‌లోని తైపీలో జన్మించారు. ఆయన అసలు పేరు జెన్-హుసన్. ఆయన పుట్టే సమయానికి తైవాన్‌లో హాయిగా బతికే పరిస్థితులు లేవు. అందుకే వారి కుటుంబం తొలుత థాయ్‌లాండ్‌కు చేరుకుంది. నాలుగు ఇంగ్లిష్ ముక్కలు వస్తే.. ఎక్కడైనా బతికేస్తారన్న ఆశతో జెన్సన్ తల్లి తనకు ఇంగ్లిష్ రాకపోయినా.. పిల్లలకు ఆంగ్లం నేర్పించే ప్రయత్నం చేశారు. ఇంగ్లిష్ డిక్షనరీ నుంచి రోజూ ఓ పదిపదాలు తీసుకుని వాటిని తనకు అప్పజెప్పాలని చెప్పారు. జెన్సన్, వాళ్లన్నయ్యా ఆ పనిని క్రమం తప్పకుండా చేసేవాళ్లు. అలా 9 ఏళ్ల వయసులో జెన్సన్ అమెరికాలో ఉండే తన మేనమామ వద్దకు వెళ్లారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)