Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జూలూరుపాడులో పోలీసుల నాకాబందీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు.
డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో చంద్రుగొండ క్రాస్ రోడ్, మహదేవ్ హోటల్, పాపకొల్లు క్రాస్ రోడ్, సాయిబాబా ఆలయం వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణే ఈ తనిఖీ ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు, అలాగే ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జూలూరుపాడు, నవంబర్ 23 : శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం పోలీసులు ప్రత్యేక నాకాబందీ తనిఖీలు నిర్వహించారు. కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో భాగంగా చంద్రుగొండ క్రాస్ రోడ్, ప్రధాన రహదారి పక్కన ఉన్న మహదేవ్ హోటల్, పాపకొల్లు క్రాస్ రోడ్, సాయిబాబా ఆలయం వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనదారుల వివరాలతో పాటు వాహన పత్రాలను పరిశీలించి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం, గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను నిరోధించడం, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించడమే ఈ నాకాబందీ తనిఖీల ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు. పోలీసుల తనిఖీలకు ప్రజలు సహకరించాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీలక్ష్మి ఎస్ఐ జీనత్ కుమార్, చండ్రుగొండ అన్నపురెడ్డిపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)