Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కాలరేఖపై కవిత్వమై నిల్చిన శతాబ్ది కవి!
By NT News telugu||4 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- The article is a tribute to the Telugu poet Dr. Guntur Seshendra Sharma, celebrating his contributions to literature and his centenary. It highlights his revolutionary style, his influence on modern poetry, and the public's disappointment that he did not receive the Jnanpith Award despite being nominated for the Nobel Prize.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
అంటారు శేషేంద్ర. ఆదికవి వాల్మీకి నుంచి ఆధునిక కవి వరకు, మన తొలికవి నన్నయ్య నుంచి నవకవి వరకు కవులు దేశ సాహిత్య, సాంస్కృతిక వైభవానికి సారథులు. అక్షరానికి ఆయువు పోసి, కావ్యకళ ద్వారా అమరం చేసిన అనితర సాధ్యులు. నదులు దేశాన్ని సాగు చేస్తే, కవులు సమాజాన్ని సాగు చేస్తారు. నదులు పండించే పంటలు ఆకలి తీరిస్తే, కవులు పండించే కలం పంటలు అమృత తుల్యమైన అనుభూతిని ప్రసాదిస్తాయి. కవులు మానవజాతి రక్తకణాల మీద పనిచేసే అలంకారాల నిధులు. గంగ, యమున, గోదావరి వంటి నదులు భారతీయ సాంస్కృతిక కేంద్రాలైతే, వాల్మీకి, వ్యాస, కాళిదాసాదులు భారతీయ సాహిత్య వైభవానికి మూలస్థానాలు. కవులు కావ్యాలనే వసంతాల్ని నాటి పోతారు. అవి…
‘ఓ నా ప్రజలారా!రండి! మీకో పద్యం ఇస్తా! ఈ పద్యం మీకో కొత్త ప్రాణం ఇస్తుంది కొత్త ప్రయాణం ఇస్తుంది’-శేషేంద్ర కవిగా ప్రపంచానికి చేసిన ప్రమాణం ఇది. కవిత్వమే తన ప్రాణవాయువుగా సాగిన తన ప్రయాణంలో శేషేంద్ర ప్రజలకిచ్చిన నైతిక మద్దతు ఇది. కాలం ఏదైనా కవి తన కలాన్ని పదునెక్కించి కాలం వెంట నడవాలి! కాలరేఖపై కవిత్వ సంతకం చేయాలి. శేషేంద్రగా ప్రపంచానికి పరిచయమైన డా.గుంటూరు శేషేంద్ర శర్మ అనన్య సామాన్యమైన కవితా సృష్టితో ఈ శతాబ్దాన్ని వెలిగించారు. శతాబ్ది కవిగా, శబ్దమాంత్రికునిగా కీర్తి గడించారు.